న్యూఢిల్లీ: క్రిప్టోలు కరెన్సీ కాదని.. అదే సమయంలో వీటిని ఒక ప్రత్యేక అసెట్‌గా (ఒక ఆస్తి/పెట్టుబడి సాధనం) గుర్తించి, నియంత్రించాలన్న అభిప్రాయాన్ని మాజీ ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ వ్యక్తం చేశారు. వర్చువల్ కరెన్సీల్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు మార్గంగా ఆయన దీన్ని ప్రస్తావించారు. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు.
కరెన్సీ అంటే దానికి చట్టబద్ధత ఉంటుందని.. కనుక క్రిప్టోలు కరెన్సీ కాదన్న విషయాన్ని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నట్టు గాంధీ చెప్పారు. క్రిప్టోలను ఒక ఆస్తిగా పరిగణించాలని కానీ.. చెల్లింపుల సాధనం, కరెన్సీ, ఆర్థిక సాధనంగా పరిగణించకూడదన్న సాధారణ అంగీకారం విధాన నిర్ణేతల్లో ఉన్నట్టు తెలిపారు. ఎందుకంటే క్రిప్టోలను జారీ చేసే వ్యక్తుల కచ్చితమైన గుర్తింపు లేదన్నారు. ‘‘కనుక దీన్ని ఒక ఆస్తిగా అర్థం చేసుకుని, ఆమోదించేట్టు అయితే.. నియంత్రించడం సులభం అవుతుంది’’ అని గాంధీ చెప్పారు. ప్రభుత్వాల నియంత్రణల పరిధిలో లేకపోతే క్రిప్టోలు నేరపూరిత కార్యకలాపాలకు అనుకూలంగా మారే ప్రమాదం ఉందన్నారు. కొన్ని సంఘటనలు దీన్ని సూచిస్తున్నాయన్నారు.
చదవండి: Cryptocurrency: క్రిప్టోకరెన్సీ దెబ్బకు వీటి ధరలు భారీగా పెరగనున్నాయా..!
Comments
Please login to add a commentAdd a comment