డమాస్కస్: మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ దేశం నుంచి పారిపోవడంతో సిరియాను అదును చూసి ఇజ్రాయెల్ దెబ్బ కొట్టింది. గడిచిన 48 గంటల్లో అక్కడి వ్యూహాత్మక మిలటరీ స్థావరాలపై 400 కంటే ఎక్కువ సార్లు దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో సిరియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
24 ఏళ్లుగా సిరియా అధ్యక్ష పదవిలో ఉన్న బషర్ అల్ అసద్ పాలనకు ముగింపు పలికాయి. దీంతో అసద్ సిరియా నుంచి రష్యా వెళ్లారు. అసద్ దేశం విడిచి వెళ్లారనే సమాచారంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది.
రసాయనిక ఆయుధాలు, రాకెట్లను నిల్వ ఉంచినట్లు అనుమానాలున్న ఆర్మీ స్థావరాలపై వైమానిక దాడులు జరిపింది. 80 శాతంపైగా సైనిక స్థావరాల్ని ధ్వంసం చేసింది. సిరియా సరిహద్దులో ఇజ్రాయెల్-విలీనమైన గోలన్ హైట్స్‌కు తూర్పున ఉన్న బఫర్ జోన్‌లోకి ఇజ్రాయెల్ తన దళాలను పంపింది.
‘గత 48 గంటల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సిరియాలోని భారీ మొత్తంలో వ్యూహాత్మక ఆయుధాల నిల్వలను ఉంచిన స్థావరాలపై దాడులు చేసింది. వాటిని తీవ్రవాదుల చేతుల్లో పడకుండా నిరోధించాము’అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది.
ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన వాటిల్లో సిరియా నేవీ స్థావరాలు, అల్ బైడా పోర్ట్, లటాకియా పోర్ట్ 15 నౌకాదళ నౌకలు, రాజధాని డమాస్కస్, ఇతర ముఖ్య నగరాల్లోని విమాన నిరోధక బ్యాటరీలు, ఆయుధాల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment