సినిమాల్లో హీరోగా రాణించాలంటే కలర్, పర్సనాలిటీ మాత్రమే కాదని, కష్టం, క్రమశిక్షణ ఉంటే కూడా రాణించొచ్చని నిరూపించాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. చూడగానే ఆకట్టుకునే రంగు అతనికి లేదు. ఆకర్షించే కటౌట్ అతనిది కాదు. అయినప్పటికీ తనదైన నటనతో కోట్లాది ప్రేక్షకులను సంపాదించి, స్టార్ హీరోగా ఎదిగాడు. వాస్తవానికి ధనుష్‌కి నటనపై ఇష్టమే లేదట. తన తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా కోరిక మేరకు బలవంతంగా సినిమాల్లో నటించాడు.
అలా అయిష్టంగానే సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు కోలివుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ధనుష్ రెమ్యునరేషన్, ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ధనుష్ ఒక్కో సినిమాకు దాదాపు 10 నుంచి 15 కోట్ల రూపాయల వరకు తీసుకుంటాడట. ఈ మధ్యే శేఖర్ కమ్ములతో ఓ సినిమాకు కమిటయ్యాడు ధనుష్. దీనికోసం ఏషియన్ సినిమాస్ ధనుష్‌కు 50 కోట్లకు పైగానే పారితోషికం ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక ధనుష్ ఆస్తుల విషయానికి వస్తే ఆయన దగ్గర ఐదు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఒక్కో కారు విలువల దాదాపుగా రూ.4 కోట్లకు పైనే ఉంటుందట. మొత్తంగా హీరో ధనుష్‌కు రూ.180 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘అత్రాంగి రే’,‘ది గ్రే మ్యాన్’తోపాటు ఓ తమిళ మూవీలో నటిస్తున్నాడు.
హీరో ధనుష్ గురించి క్లుప్తంగా
- 1983 జులై 28న మద్రాసులో జననం
- ధనుష్ అసలు పేరు వెంకటేశ్ ప్రభు కస్తూరి రాజా
- కోలీవుడ్ దర్శకుడు, నిర్మాత కస్తూరి రాజా రెండో కొడుకే ధనుష్
- ‘7జీ బృందావన కాలనీ’డైరెక్టర్ సెల్వ రాఘవన్ ధనుష్‌కి సోదరుడు
- సెల్వరాఘవన్ ఒత్తిడితో ధనుష్ నటనలోకి ఎంట్రీ
- ‘తుల్లువదో ఇలమై(2002)’తో కోలీవుడ్ ఎంట్రీ
- ‘రఘువరన్ బీటెక్’తొ తెలుగువారికి దగ్గరయ్యాడు
- ‘రంజనా’చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు
- ‘ది ఎక్ట్స్రార్డనరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ధనుష్ నటించిన తొలి ఆంగ్ల చిత్రం
- ధనుష్ రాసి, పాడిన‘వై దిస్ కొలవెరి’తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు
- రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో 2004లో ప్రేమ వివాహం
- ఇద్దరు కుమారులు, యాత్రరాజా, లింగారాజా
- ప్రస్తుతం ‘అత్రాంగి రే’,‘ది గ్రే మ్యాన్’తోపాటు ఓ తమిళ మూవీలో నటిస్తున్నాడు
Comments
Please login to add a commentAdd a comment