
ఇటీవల కాలంగా హీరోలు, నిర్మాతల మధ్య మాటల యుద్ధం తరుచూ జరుగుతోంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఈ తరహా వివాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట సంచలనం సృష్టిస్తున్నాయి. ‘నిర్మాతల నుంచి పారితోషికం వసూళు చేసుకోవటం ఎంతో కష్టంగా మారింది. కేవలం రెమ్యూనరేషన్ వసూళు చేసుకునేందుకు ఇతర పనులు వదులుకోవాల్సి వస్తుంద’న్నాడు ధనుష్.
ఈ వ్యాఖ్యలపై పలువురు నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్, అజిత్ లాంటి టాప్ స్టార్లు కూడా ఇలాంటి ఆరోపణలు చేయటం లేదంటున్నారు. ధనుష్ నిర్మాతలకు పూర్తి స్థాయిలో సహకరించకపోవటం కారణంగానే నష్టాలు వస్తున్నాయని ఆరోపించారు. అంతేకాదు ధనుష్ సినిమాలతో నిర్మాతలకు లాభాలు వచ్చిన సందర్భాలు చాలా తక్కువన్నారు. మరి ఈ ఆరోపణలపై ధనుష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment