Actor Dhanush Shocking Remuneration For Thiruchitrambalam Movie, Goes Viral - Sakshi
Sakshi News home page

Dhanush: హాట్‌టాపిక్‌గా ధనుష్‌ రెమ్యునరేషన్‌.. ఒక్క సినిమాకే అన్ని కోట్లా!

Published Wed, Aug 17 2022 3:33 PM | Last Updated on Wed, Aug 17 2022 5:09 PM

Dhanush Remuneration Goes Viral For Thiruchitrambalam Movie - Sakshi

సినీ సెలబ్రెటీల రెమ్యునరేషన్‌పై తరచూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఈ హీరోహీరోయిన్‌ పారితోషికం ఇంత అంత పెంచారంటూ నెట్టింట చర్చించుకుంటారు. ఇప్పుడు తాజాగా కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ రెమ్యునరేషన్‌ హాట్‌టాపిక్‌గా మారింది. ఇండియన్‌ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ధనుశ్‌ ఒకరనే విషయం తెలిసిందే.

చదవండి: తాప్సీపై డైరెక్టర్‌ వల్గర్‌ కామెంట్స్‌, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

‘ది గ్రే మ్యాన్‌’ మూవీతో ఇటివలె హాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ధనుష్‌ భారీగా పారితోషికం పెంచాడనే వార్తలు గుప్పుమన్నాయి. దంతో ప్రస్తుతం ధనుష్‌ నటిస్తున్న చిత్రాల పారితోషికంపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ధనుష్‌ నటించిన తిరుచిత్రాంబళం(తెలుగులో తిరు) మూవీకి ధనుష్‌ తీసుకున్న రెమ్యునరేషన్‌పై చర్చనీయాంశమైంది. రేపు ఆగస్ట్‌ 18న విడుదల కాబోతున్న ఈ సినిమాకు ధనుష్‌ రూ. 15 నుంచి రూ. 17 కోట్లు తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

చదవండి: ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది: అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు

మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్‌ సరసన  రాశీ ఖన్నా, ప్రియ భవానీ శంకర్‌ నటించగా.. నిత్యా మీనన్‌ కీలక పాత్ర పోషించింది. కాగా గత కోంతకాలంగా ధనుశ్‌కు పెద్దగా హిట్స్‌ లేవనే విషయం తెలిసిందే. కర్ణన్‌తో మంచి విజయం అందుకున్న ధనుష్‌ ఆ తర్వాత నటించిన జగమేతందిరం, పటాస్‌, ది గ్రే మ్యాన్‌ వరుసగా పరాజయం పొందాయి. దీంతో ధనుష్‌ ఆశలన్ని తిరుచిత్రాంబళంపైనే ఉన్నాయి. ఇదిలా ఉంటే సార్‌ మూవీతో ధనుష్‌ నేరుగా తెలుగులో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ను జరుపుకుంటోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement