జమాతె ఆస్తులు సీల్‌ | State Investigation Agency seizes Jamaat-e-Islami assets in Jammu kashmir | Sakshi
Sakshi News home page

జమాతె ఆస్తులు సీల్‌

Published Sun, Dec 18 2022 6:41 AM | Last Updated on Sun, Dec 18 2022 6:41 AM

State Investigation Agency seizes Jamaat-e-Islami assets in Jammu kashmir - Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని నిషేధిత జమాతె ఇస్లామీ(జేఈఐ) సంస్థకు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను శనివారం రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్‌ఐఏ) సీల్‌ వేసింది.

బారాముల్లా, బందిపొరా, గందేర్‌బల్, కుప్వారా జిల్లాల్లోని సుమారు 12 ప్రాంతాల్లో ఉన్న రూ.100 కోట్ల విలువైన ఈ ఆస్తుల్లోకి ప్రవేశించడానికి గానీ, ఎవరూ వినియోగించుకోవడానికి ఇక వీలుండదని అధికారులు తెలిపారు. జేఈఐ తన నిధులను వేర్పాటు వాద కార్యకలాపాల కోసం, జాతి వ్యతిరేక, ఉగ్రవాద కార్యకలాపాల కోసం వినియోగించకుండా ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు. జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా జేఈఐకి సుమారు 188 ఆస్తులున్నట్లు ఎస్‌ఐఏ గుర్తించింది. వీటిపై విడతల వారీగా చర్యలు తీసుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement