seizes
-
రూ.14.37 కోట్ల బంగారం స్వాదీనం
సాక్షి, అమరావతి: విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.14.37 కోట్ల విలువైన 17.90 కిలోల బంగారాన్ని విజయవాడ కస్టమ్స్ అధికారులు స్వాదీనం చేసుకొని.. ఒక మహిళ సహా 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను విజయవాడ కస్టమ్స్ కమిషనర్ ఎస్.నరసింహారెడ్డి ఆదివారం మీడియాకు తెలియజేశారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారనే సమాచారం మేరకు విజయవాడ కస్టమ్స్(ప్రివెంటివ్) కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించామని చెప్పారు.తాడిపత్రి, నెల్లూరు రైల్వేస్టేషన్‌తో పాటు బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద కస్టమ్స్(ప్రివెంటివ్), తిరుపతి, గుంటూరు సెంట్రల్ జీఎస్టీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయని తెలిపారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్న 17.90 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని 16 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల్లో ఒక మహిళ కూడా ఉన్నారని చెప్పారు. నిందితులను విశాఖపట్నం ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్టు నరసింహారెడ్డి తెలిపారు. -
మదురో విమానం సీజ్
వాషింగ్టన్: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో విమానాన్ని అమెరికా సీజ్ చేసింది. వెనిజులాపై అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఈ విమానాన్ని సమకూర్చుకున్నారని, ఇతర క్రిమినల్ అభియోగాలతో మదురో విమానాన్ని డొమినికన్ రిపబ్లిక్లో అమెరికా స్వా«దీనం చేసుకుంది. దాన్ని సోమవారం ఫ్లోరిడాకు తరలించింది. వెనిజులా– అమెరికాల మధ్య చాలాఏళ్లుగా సంబంధాలు బెడిసికొట్టాయి. వెనిజులాపై ఆర్థిక ఆంక్షలే కాకుండా పలుఇతర ఆంక్షలను కూడా అమెరికా విధించింది. వెనిజులాలో బతుకు దుర్భరమై లక్షల మంది మెక్సికో– అమెరికా సరిహద్దు ద్వారా అగ్రరాజ్యంలోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవలి వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల్లో మదురో విజయానికి సంబంధించి సందేహాలను వ్యక్తం చేస్తూ అమెరికా వెనిజులా నుంచి నిర్దిష్ట పోల్ డేటాను కోరింది. వెనిజులాకు చెందిన ఈ డసాల్డ్ ఫాల్కన్ 900 విమానం ఖరీదు రూ.109 కోట్లు. కొద్దినెలలుగా ఇది డొమినికన్ రిపబ్లిక్లో ఉందనే సమాచారంతో రంగంలోకి దిగిన అమెరికాకు చెందిన వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు మదురో విమానాన్ని స్వా«దీనం చేసుకొని ఫ్లోరిడాకు తరలించాయి. అమెరికా దీన్ని జప్తు చేసుకొనేందుకు చర్యలు చేపట్టింది. -
తొలిదశకు ముందే రికార్డ్! రోజుకు రూ.100 కోట్లు..
న్యూఢిల్లీ, సాక్షి: ఈసారి సార్వత్రిక ఎన్నికలు తొలిదశకు ముందే రికార్డ్ సృష్టించాయి. 18వ లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు రికార్డు స్థాయిలో రూ. 4,650 కోట్ల విలువైన నగదు, బంగారం, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నాయని భారత ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది. స్వాధీనం చేసుకున్న మొత్తంలో 45 శాతం విలువ మాదక ద్రవ్యాలదే కావడం గమనార్హం. ఈసారి స్వాధీనం చేసుకున్న మొత్తం 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న రూ.3,475 కోట్ల కంటే ఎక్కువ. ఈ ఏడాది మార్చి 1 నుంచి సగటున ప్రతిరోజూ రూ.100 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు ఈసీ పేర్కొంది. సమగ్ర ప్రణాళిక, సహకారం, ఏజెన్సీల నుంచి ఏకీకృత నిరోధక చర్యలు, చురుకైన ప్రజల భాగస్వామ్యంతోపాటు ఆధునిక టెక్నాలజీని సమర్థంగా వినియోగించడంతోనే రికార్డ్ స్థాయిలో నగదు, ఇతర వస్తువులు పట్టుకోవడం సాధ్యమైందని ఎలక్షన్ కమిషన్ వివరించింది. -
నేషనల్ హెరాల్డ్ కేసులో రూ.752 కోట్లు ఈడీ సీజ్
ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు సంబంధం ఉన్న యంగ్ ఇండియన్, అసోసియేటెడ్ జర్నల్(ఏజేఎల్)కు చెందిన రూ. 752 కోట్ల విలువైన ఆస్తిని ఈడీ అటాచ్ చేసింది. యంగ్ ఇండియాకు చెందిన రూ.90 కోట్ల ఆస్తిని, నేషనల్ హెరాల్డ్‌కు చెందిన ఢిల్లీ, ముంబయిలోని భవనాలు, లక్నోలోని నెహ్రూ భవన్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఏజేఎల్ భవనాల విలువ రూ.661.69 కోట్లు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ED has issued an order to provisionally attach properties worth Rs. 751.9 Crore in a money-laundering case investigated under the PMLA, 2002. Investigation revealed that M/s. Associated Journals Ltd. (AJL) is in possession of proceeds of crime in the form of immovable properties… — ED (@dir_ed) November 21, 2023 నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కొనుగోలులో మోసం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. వార్తాపత్రికలను ప్రచురించడానికి రాయితీ ధరలకు భూమిని పొందిన అసోసియేటెడ్ జర్నల్.. 2008లో తన కార్యకలాపాలను మూసివేసింది. ఆ ఆస్తులను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందనేది ప్రధాన ఆరోపణ. ఏజేఎల్‌తో వందల కోట్ల ఆస్తులు సంపాదించేందుకు కుట్ర జరిగినట్లు తేలింది. ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది. Reports of attachment of AJL's properties by the Enforcement Directorate are a clear indication of the BJP's panic in the ongoing elections. Staring at defeat in Chhattisgarh, Madhya Pradesh, Rajasthan, Telangana and Mizoram, the BJP Govt feels compelled to misuse its… pic.twitter.com/pnJYnVartI — Mallikarjun Kharge (@kharge) November 21, 2023 కాగా.. ఎన్నికల ముందు అసోసియేట్ జర్నల్ ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం బీజేపీ భయాన్ని సూచిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్దే ఎద్దేవా చేశారు. ఓటమిని దారి మళ్లించడానికి అసోసియేట్ జర్నల్ ఆస్తుల వ్యవహారాన్ని కేంద్రం ముందుకు తీసుకువచ్చిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సంఘ్వీ ఆరోపించారు. ప్రతీకార రాజకీయాలు కాంగ్రెస్‌ను నాశనం చేయలేవని అన్నారు. ఇదీ చదవండి: 'అలా అయ్యుంటే టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచేది! -
గీతం యూనివర్శిటీలో ప్రభుత్వ భూములు స్వాధీనం
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్శిటీలో ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం 36 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకోగా, గతంలో ప్రారంభించిన ప్రక్రియకు కొనసాగింపుగా తాజాగా సర్వే నంబర్ 15,16,19,20 పరిధిలోని 4.36 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్‌ను రెవెన్యూ సిబ్బంది వేయిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా గీతం వర్శిటీ అవసరాలకు ప్రభుత్వ భూములను వినియోగించుకుంటోంది. అన్యాక్రాంతమైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: ‘సెల్ఫీ’ మాయం.. తోకముడిచిన టీడీపీ నేతలు -
జమాతె ఆస్తులు సీల్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని నిషేధిత జమాతె ఇస్లామీ(జేఈఐ) సంస్థకు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను శనివారం రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్ఐఏ) సీల్ వేసింది. బారాముల్లా, బందిపొరా, గందేర్బల్, కుప్వారా జిల్లాల్లోని సుమారు 12 ప్రాంతాల్లో ఉన్న రూ.100 కోట్ల విలువైన ఈ ఆస్తుల్లోకి ప్రవేశించడానికి గానీ, ఎవరూ వినియోగించుకోవడానికి ఇక వీలుండదని అధికారులు తెలిపారు. జేఈఐ తన నిధులను వేర్పాటు వాద కార్యకలాపాల కోసం, జాతి వ్యతిరేక, ఉగ్రవాద కార్యకలాపాల కోసం వినియోగించకుండా ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు. జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా జేఈఐకి సుమారు 188 ఆస్తులున్నట్లు ఎస్ఐఏ గుర్తించింది. వీటిపై విడతల వారీగా చర్యలు తీసుకుంటోంది. -
గేమింగ్ యాప్ స్కామ్.... సుమారు రూ. 17 కోట్లు స్వాధీనం
న్యూఢిల్లీ: కోల్‌కతాకు చెందిన ఓ వ్యాపారి ఆవరణలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సోదాల్లో ఈడీ సుమారు రూ. 12 కోట్ల నగదు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. మొబైల్ గేమింగ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వ్యాపారవేత్త అమీర్‌ఖాన్ నివాసాలపై బ్యాంకు అధికారులతో కలిసి ఈడీ అధికారుల బృందం దాడులు నిర్వహించింది. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. వ్యాపారి నివాసంలో ఈడీ దాడుల నేపథ్యంలో కేంద్ర బలగాలను పటిష్టంగా మోహరించారు. ఈ నగ్గేట్స్ అనే మొబైల్ గేమింగ్ యాప్‌తో వినియోగదారులను మోసం చేసినందుకు నిందితుడు అమీర్ఖాన్తోపాటు మరికొంత మంది పై ఫెడరల్ బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేను నమోదు చేశారు. ఈ మేరకు ఈడీ గేమింగ్ స్కామ్ గురించి మాట్లాడుతూ....తొలుత వినియోగ దారులకు గేమింగ్ యాప్ ప్రారంభంలోనే మంచి కమిషన్ వాలెట్లు అందించి విశ్వాసాని పొందుతాయి. ఆ తర్వాత వారి నుంచి ఎక్కుక కొనుగోళ్లను చేయించి అనుహ్యంగా వారి వాలెట్లో ఉన్న మనీ అంతా స్వాహా చేసి అకస్మాత్తగా యూప్ పనిచేయడం మానేస్తుంది. ఆ తర్వాత రీ ఇన్స్టాల్ చేసుకోవాలంటు రావడం మొదలవుతుంది. ఈలోగా అందులో ఉన్న మన డేటా మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. అప్పుడికి గానీ వినియోగదారుడి మోసపోయినట్లు గ్రహించలేడు అని ఈడీ వివరించింది. (చదవండి: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన అమిత్ షా... సీఎం సొంత గడ్డ నుంచి ప్రచారం) -
చైనా కంపెనీ షావోమీకి బిగ్ షాక్
న్యూఢిల్లీ: చైనా మొబైల్ దిగ్గజం షావోమీ ఇండియాకు ఈడీ షాకిచ్చింది. విదేశీ మారకద్రవ్య చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై రూ.5,551.27 కోట్ల విలువైన కంపెనీ నిధులను శనివారం జప్తు చేసింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘గత ఫిబ్రవరిలో రూ.5,551.27 కోట్ల విలువైన నిధులను సొంత గ్రూప్ కంపెనీతో పాటు మొత్తం మూడు విదేశీ కంపెనీలకు రాయల్టీ ముసుగులో పంపించింది. చైనాకు చెందిన తన మాతృసంస్థ షావోమీ ఆదేశాల మేరకే ఈ పని చేసింది. అంతిమంగా షివోమీ గ్రూప్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే రెండు యూఎస్ కంపెనీలకు కూడా నిధులు బదిలీ చేసింది’’ అని ఈడీ వివరించింది. ఇది కూడా చదవండి: అది కాళరాత్రి: జెలెన్స్కీ.. ఆయనపై ‘టైమ్’ కవర్ స్టోరీ -
డ్రగ్స్ రాకెట్ కలకలం: కాలేజీ స్టూడెంట్స్, టెక్కీలే టార్గెట్
బనశంకరి: కర్ణాటకలో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగు చూసింది. బెంగళూరు సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులు శుక్రవారం బెంగళూరులోని హెణ్ణూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంటిపై దాడి చేసి అస్సాంకు చెందిన ప్రముఖ డ్రగ్స్ పెడ్లర్ నబరన్‌చెక్మా, అతని అనుచరులు మోబీన్బాబు, రోలాండ్ రోడ్నిరోజర్, తరుణ్‌కుమార్ లాల్‌చంద్‌ను అరెస్ట్ చేశారు. రూ.6 కోట్ల విలువైన 15 కిలోల ఆశీశ్ ఆయిల్, 11 కిలోల గంజాయి, 530 గ్రాముల సెరస్ ఉండలు స్వాధీనం చేసుకున్నట్లు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ మీడియాకు తెలిపారు. రాష్ట్ర పోలీస్ చరిత్రలో 15 కిలోల ఆశీశ్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని తెలిపారు. గత ఏడాది సీసీబీ యాంటీ డ్రగ్స్ పోలీసులు పక్కా సమాచారంతో బెంగళూరులోని రామమూర్తినగరలో దాడులు నిర్వహించి నబరన్‌చెక్మా అనుచరుడు సింటోథామస్ను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నబరన్‌చెక్మా తప్పించుకున్నాడు. అతని కోసం గాలిస్తుండగా హెణ్ణూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు అందిన సమాచారంతో దాడులు నిర్వహించగా నబరన్‌చెక్మా గ్యాంగ్, అతని అనుచరులు పట్టుబడ్డారని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. నబరన్‌చెక్మా తన అనుచరులతో కలిసి కాలేజీ విద్యార్థులు, ఐటీ, బీటీ కంపెనీలకు చెందిన టెక్కీలకు ఆశీశ్ ఆయిల్, గంజాయిని విక్రయించేవాడని తెలిపారు. (Mirabai Chanu: మరోసారి మనసు దోచుకున్న చాను, ప్రాక్టీస్ షురూ, ఫోటో వైరల్) Yet another drug haul by CCB Anti Narcotics Wing..Rs 5 cr worth of 15 Kgs Hashish, 10 Kg Cannabis, Charas, Cocaine, Ecstacy pills, LSD strips, Hydro Ganja plants seized.. 5 accused arrested..& r main kingpin of hashish supply in Blore..@CPBlr @BlrCityPolice pic.twitter.com/RdGi70EBJX — Sandeep Patil IPS (@ips_patil) August 6, 2021 -
మాల్యాకు మరో షాక్
సాక్షి,న్యూఢిల్లీ: ఆర్థికనేరగాడు, వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి షాక్ ఇచ్చింది. ఫ్రాన్స్‌లో 1.6 మిలియన్ యూరోల (రూ.14.35 కోట్లు) ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఈడీ అభ్యర్థన మేరకు ఫ్రెంచ్ అథారిటీ వీటిని స్వాధీనం చేసుకుంది. 32 అవెన్యూ ఫోచ్‌లో ఉన్న మాల్యా ఆస్తిని ఫ్రెంచ్ అధికారుల ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. పీఎంఎల్ఏ ఆరోపణలపై నిర్వహించిన దర్యాప్తులో భాగంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్యాంక్ ఖాతా నుండి పెద్ద మొత్తంలో నిధులను విదేశాలకు పంపినట్లు తేలిందని ఈడీ వెల్లడించింది. 2016 జనవరిలో దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఎటాచ్ చేసిన మాల్యా మొత్తం ఆస్తుల విలువ రూ .11,231.70 కోట్లకు చేరిందని పేర్కొంది. (మాల్యా అప్పగింతలో అడ్డంకులు ఏమిటి?) కాగా వేల కోట్ల రూపాయల రుణాలను భారతీయ ప్రభుత్వ బ్యాంకులను ఎగవేసి లండన్‌లో చెక్కేసిన మాల్యాను తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే లండన్ విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా, యుకె హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ మధ్య గత నెలలో జరిగిన చర్చల సందర్భంగా లిక్కర్ బారన్ అప్పగింత విషయాన్ని ప్రస్తావించింది. అలాగే 2021 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రానున్న బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ మధ్య ఈ విషయం ప్రముఖంగాప్రస్తావనకు రానుందని భావిస్తున్నారు. మరోవైపు మాల్యాను భారత్‌కు అప్పగించడం కోసం యుకెలో పెండింగ్‌లో ఉన్న విచారణపై ఆరు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని నవంబర్ 2 న సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. -
చెరుకు సుధాకర్ కొడుకు హాస్పిటల్ సీజ్
సాక్షి, నల్గొండ : తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన కుమారుడు నిర్వహిస్తున్న జిల్లా కేంద్రంలోని నవ్య ఆస్పత్రిపై అక్రమంగా కేసులను పెట్టి సీజ్ చేశారని ఆయా సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక నవ్య హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, విద్యావంతుల వేదిక నాయకులు పందుల సైదులు, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్‌రెడ్డి మాట్లాడారు. అతితక్కువ ఫీజులతో నిరుపేదలకు వైద్యం అందిస్తున్న నవ్య ఆస్పత్రి నిర్వాహకులు, డాక్టర్ చెరుకు సుధాకర్ కుమారుడు డాక్టర్ సుహాస్‌పై పోలీసులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి అత్యుత్సాహంతో వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేసి సీజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఏకపక్షంగా ఎలా సీజ్ చేస్తారని వారు ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటుగా జిల్లాకేంద్రంలోని పలు ఆస్పత్రులపై ఫిర్యాదులు వందల సంఖ్యలో వచ్చినప్పటికీ ఎందుకు ఆయా ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తక్కువ ఫీజులతో పేదలకు వైద్యం చేయడం నేరమా అన్నారు. కేవలం నవ్య హాస్పిటల్ బడుగు, బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిది కావడంతో పాటుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా ఉన్న డాక్టర్ చెరుకు సుధాకర్‌పై రాజకీయంగా అణిచివేతలో భాగమే అక్రమ కేసులు, ఆస్పత్రిని సీజ్ చేయడమన్నారు. వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించి డాక్టర్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవడంతో పాటుగా హాస్పిటల్ సీజ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కుట్రలో భాగమే : చెరుకు ఆస్పత్రిలో తక్కువ ఫీజులతో పేదలకు వైద్యం అందిస్తున్న డాక్టర్‌పై అక్రమంగా కేసులను పెట్టి అరెస్టు చేయడంతో పాటుగా ఆస్పత్రిని సీజ్ చేయడం దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదని డాక్టర్ చెరుకు సుధాకర్ తెలిపారు. రాజకీయంగా తనపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం కుట్రపన్నిందని ఆరోపించారు. ఆత్మబలిదానాలతో సాధించుకున్న రాష్ట్రంలో ఇంతటి దుర్మార్గమైన చర్యలు ఉంటాయని ఆనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేసులను ఎత్తివేసి సీజ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపాటి భిక్షం, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇందూరు సాగర్, ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్‌మాదిగ, కట్టెల శివకుమార్, ఏర్పుల శ్రవన్‌కుమార్, జనార్దన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నేరస్తుల కట్టడికే కార్డన్ సెర్
భువనగిరిఅర్బన్ : నేరస్తులను కట్టడి చేసేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న డీసీపీ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని తాతానగర్, పహాడీనగర్ కాలనీల్లో బుధవారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 50 బైక్‌లు, నాలుగు కార్లు, ఐదు ఆటోలను సీజ్ చేశారు. అలాగే ముగ్గురు రౌడిషీటర్లు, మరో ముగ్గురు అనుమానితులు, ఇద్దరు ఎక్స్కాన్వెర్స్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండా బెల్టుషాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని, గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న మరోవ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రెండు గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా డీసీపీ కోరారు. కాగా, తెల్లవారుజామునే పోలీసులు తనిఖీ చేపట్టడంతో ప్రజలు ఒకింత భయాందోళన చెందారు. కార్డన్సర్చ్లో భువనగిరి ఏసీపీ జితేందర్‌రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ రమేష్, 6 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 130 మంది కానిస్టేబుల్, హోంగార్డులు పాల్గొన్నారు. సీజ్ చేసిన వాహనాలు ధృవపత్రాలను పరిశీలిస్తున్న డీసీపీ -
ఉత్తర కొరియా నౌకను సీజ్ చేసిన దక్షిణకొరియా
సియోల్ : ఉత్తర కొరియా-దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరోసారి ఎక్కువయ్యేట్టుంది. ఉత్తర కొరియాకు చెందిన నౌకను దక్షిణ కొరియా సీజ్ చేసింది. తమ సముద్ర జలాల నుంచి అక్రమంగా ఆయిల్‌ను తరలిస్తున్న లైట్ హౌజ్ విన్మోర్ అనే నౌకను తమ అదుపులోకి తీసుకున్నారు. ఇది ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధమైనందునే సీజ్ చేసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉత్తర కొరియాకు ఎలాంటి వస్తువును రవాణా చేయకూడదని యూఎన్ సాంక్షన్స్ చెబుతున్నాయని పేర్కొంది. ఉత్తర కొరియాకు రిఫైండ్ ఆయిల్‌ను మొత్తం 11 ప్రధాన నౌకలు రహస్యంగా అందిస్తుంటాయని, అందులో ఇదొకటని, ఇవి కనిపిస్తే వెంటనే సీజ్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని గతంలోనే అమెరికా ఐక్యరాజ్యసమితిని కోరిందని, ఆ ప్రకారమే తాము నౌకను సీజ్ చేసినట్లు తెలిపారు. -
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్‌కు షాక్
-
ఇప్పటివరకు ఎంత డబ్బు పట్టుబడిందో తెలుసా?
దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ నిర్వహిస్తున్న దాడుల్లో కుప్పలు తెప్పలుగా కొత్త కరెన్సీ నోట్లు, భారీ మొత్తంలో బంగారం పట్టుబడుతున్నాయి. వీటిని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుని విచారణ సాగిస్తున్నారు. పాత నోట్ల రద్దు అనంతరం కర్ణాటక, గోవా ప్రాంతాల్లో ఐటీ డిపార్ట్మెంట్ జరిపిన దాడుల్లో పట్టుబడ్డ నగదు, బంగారం వివరాలను అధికారులు వెల్లడించారు. 2016 నవంబర్ 9 నుంచి కర్ణాటక, గోవా ప్రాంతాల్లో మొత్తం రూ.29.86 కోట్ల నగదు పట్టుబడినట్టు ఐటీ డిపార్ట్మెంట్ తెలిపింది. నగదుతో పాటు 41.6 కేజీల బంగారం, 14 కేజీల జువెల్లరీ అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వివరించారు. తాము స్వాధీనం చేసుకున్న ఈ నగదులో రూ.20.22 కోట్లు కొత్త రూ.2000 నోట్లేనని ఐటీ శాఖ వెల్లడించింది. అంతేకాక లెక్కలో చూపని నగదు 36 కేసుల్లో రూ.1000 కోట్లకు పైగా బయటపడినట్టు పేర్కొంది. వీటితో పాటు వివిధ ప్రాంతాల్లో ఐటీ డిపార్ట్మెంట్, పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో నేడు ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో ఐదుగురు వ్యక్తుల నుంచి రూ.3.25 కోట్ల పాత నోట్లను పట్టుకున్నారు. రహస్య సమాచారంతో ఆదాయపు పన్ను శాఖతో కలిసి జరిపిన ఈ దాడిలో ఈ నగదు పట్టుబడినట్టు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు(క్రైమ్) రవింద్ర యాదవ్ పేర్కొన్నారు. అసోంలో 85 ఏళ్ల వృద్దుడైన వ్యాపారవేత్త హర్దీప్ సింగ్ బేదీ ఇంట్లో కూడా కోటిన్నర రూపాయల కొత్త నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 75వేల రూపాయలకు పైగా కొత్త రూ.500 నోట్లు, మిగిలినవి రూ.2వేల రూపాయల నోట్లు. -
బ్రోకర్ల గుట్టు రట్టు..భారీగా కొత్త నోట్లు స్వాధీనం
బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు తరువాత భారీగా నమోదవుతున్నఅక్రమ నగదు లావాదేవీల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పాత నోట్ల మార్పిడిలో మధ్యవర్తులు, బ్రోకర్లు అక్రమాలకు హద్దు లేకుండా పోతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చాకచక్యంగా వ్యవహరించి అక్రమార్కులకు చెక్ పెడుతున్నారు. తాజాగా కర్ణాటకలో భారీగా కొత్త కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నగదు మార్పిడికి పాల్పడుతున్న రాకెట్టును ఛేదించిన ఈడీ అధికారులు ఏడుగురు మధ్యవర్తులను అరెస్టు చేశారు. సుమారు 93 లక్షల రూపాయల స్వాధీనం చేసుకుంది. నగదు బదిలీ దర్యాప్తులో భాగంగా ఈడీ అరెస్ట్ చేసిన వారిలో ఒక ప్రభుత్వ అధికారి బంధువు సహా ఉన్నారు. రూ .2000ల కొత్త నోట్ల రూ 93 లక్షలను వీరినుంచి స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ ఏ) కింద కేసునమోదు చేశామన్నారు. ఇటీవల ఆదాయపన్నుఅధికారులు 5.7 కోట్ల కొత్త నోట్లనుస్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. ఈ దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులుగా కస్టమర్లుగా వ్యవహరించి బ్రోకర్ల గుట్టురట్టు చేశారు. బ్యాంకు అధికారులతో కుమ్మక్కైన బ్రోకర్లు పాత నగదు మార్పిడిలో 15-35 శాతం కమిషన్ తీసుకుంటున్నట్టుగా తమ దర్యాప్తులో తేలిందని అధికారులు చెప్పారు. నిందితులను స్థానిక కోర్టులోహాజరపర్చనున్నట్టు చెప్పారు. కమిషన్ తీసుకుంటూ నల్లధనాన్ని వైట్ గా మార్చేందుకు గాను ఒక ముఠాగా ఏర్పడి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేశారు. దీనిపై తమ విచారణ కొనసాగుతుందని తెలిపారు.