వాషింగ్టన్: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో విమానాన్ని అమెరికా సీజ్ చేసింది. వెనిజులాపై అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఈ విమానాన్ని సమకూర్చుకున్నారని, ఇతర క్రిమినల్ అభియోగాలతో మదురో విమానాన్ని డొమినికన్ రిపబ్లిక్‌లో అమెరికా స్వా«దీనం చేసుకుంది. దాన్ని సోమవారం ఫ్లోరిడాకు తరలించింది. వెనిజులా– అమెరికాల మధ్య చాలాఏళ్లుగా సంబంధాలు బెడిసికొట్టాయి.
వెనిజులాపై ఆర్థిక ఆంక్షలే కాకుండా పలుఇతర ఆంక్షలను కూడా అమెరికా విధించింది. వెనిజులాలో బతుకు దుర్భరమై లక్షల మంది మెక్సికో– అమెరికా సరిహద్దు ద్వారా అగ్రరాజ్యంలోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవలి వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల్లో మదురో విజయానికి సంబంధించి సందేహాలను వ్యక్తం చేస్తూ అమెరికా వెనిజులా నుంచి నిర్దిష్ట పోల్ డేటాను కోరింది. వెనిజులాకు చెందిన ఈ డసాల్డ్ ఫాల్కన్ 900 విమానం ఖరీదు రూ.109 కోట్లు. కొద్దినెలలుగా ఇది డొమినికన్ రిపబ్లిక్‌లో ఉందనే సమాచారంతో రంగంలోకి దిగిన అమెరికాకు చెందిన వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు మదురో విమానాన్ని స్వా«దీనం చేసుకొని ఫ్లోరిడాకు తరలించాయి. అమెరికా దీన్ని జప్తు చేసుకొనేందుకు చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment