న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ అయిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 2.5 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించాయి. ఈ సంస్థ 2000 డిసెంబర్‌లో మొదలైంది. 2020–21 నాటికి ఏయూఎం రూ.100 కోట్లుగా ఉంటే, ఇన్నేళ్ల కాలంలో రూ.2.5 లక్షల కోట్లకు చేరింది. మొదటి రూ.50,000 కోట్ల మైలురాయిని చేరుకునేందుకు తొమ్మిదేళ్లు పట్టగా, రూ.లక్ష కోట్ల ఏయూఎం మార్క్‌ను 14 ఏళ్లలో చేరుకుంది.
ఆ తర్వాత ఆరేళ్లలోనే ఏయూఎంను రెట్టింపు చేసుకుంది. రూ.లక్ష కోట్ల మైలురాయిని చేరిన తర్వాత వృద్ధి వేగాన్ని అందుకున్నట్టు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ తెలిపింది. కంపెనీ పట్ల కస్టమర్ల విశ్వాసానికి తమ నిర్వహణలోని ఆస్తులే ప్రామాణికమని, ఎందుకంటే జీవిత బీమా దీర్ఘకాల ఉత్పత్తి అని సంస్థ పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంకు ప్రమోట్ చేస్తున్న ఈ సంస్థ జీవిత బీమా మార్కెట్‌లో 15.7 శాతంతో మొదటి స్థానంలో ఉంది. 2022 సెప్టెంబర్ నాటికి నూతన పాలసీల సమ్ అష్యూరెన్స్ పరంగా ఈ స్థానం దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment