టాలీవుడ్ ‘హాస్య బ్రహ్మ’, నటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో వందల చిత్రాల్లో నటించిన ఆయన నిన్నటితో 67వ వసంతంలోకి అడుగుపెట్టారు. బుధవారం(ఫిబ్రవరి 1న) బ్రహ్మానందం బర్త్‌డే. ఆయన పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఇంటికి వెళ్లిన ఆయన బర్త్‌డేను సెలబ్రెట్ చేశారు. ఇక ఆయన చేసిన సినిమాలకు గానూ గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కిన తొలి నటుడిగా నిలవడం విశేషం. కేవలం ముఖ కవళికలతోనే నవ్వించే ఆయన హాస్య బ్రహ్మగా బిరుదు పొందారు.
చదవండి: కత్రినా వచ్చాక నా లైఫ్ మారిపోయింది.. నేను పర్‌ఫెక్ట్ హస్భెండ్ కాదు..!: విక్కీ కౌశల్
దాదాపు ఇండస్ట్రీలో 31 సంవత్సరాల పాటు కమెడియన్‌గా చక్రం తిప్పిన ఆయన దాదాపు1200లకు పైగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం అనారోగ్య సమస్యల కారణంగా పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఆడపాదడపా చిత్రాలు చేస్తూ వస్తున్నారు. అన్ని వందల సినిమాలు చేసిన బ్రహ్మీ ఇప్పటి వరకు ఎంత కూడబెట్టి ఉంటారనేది నెటిజన్లో ఆసక్తి నెలకొలంది. బుధవారం ఆయన బర్త్‌డే నేపథ్యంలో బ్రహ్మానందం ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. ఈ తాజా బజ్ ప్రకారం.. నటుడిగా ఆయన వందల కోట్లు సంపాదించారట. ఆయన స్థిర, చరాస్థులు కలిపి దాదాపు రూ. 500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
చదవండి: నడవలేని స్థితిలో నటుడు విజయకాంత్.. వీల్ చైర్‌లోనే..
అలాగే కోట్లు విలువ చేసే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉందట. దీనితో పాటు జుబ్లిహిల్స్‌లో ఓ లగ్జరీ ఇల్లు కూడా. ఇక ఆయన కార్ల కలెక్షన్స్‌కి వస్తే.. ఆడి క్యూ7, క్యూ8(Audi R8, Audi Q7)తో పాటు మెర్సిడెజ్ బెంజ్ కారు ఉందట. ఇలా నటుడిగా బ్రహ్మీ బాగానే ఆస్తులు సంపాదించాడంట నెట్టింట చర్చించుకుంటున్నారు. అయితే వీటిపై అధికారిక సమాచారం మాత్రం లేదు. కాగా బ్రహ్మానందం నటుడే కాదు.. చిత్ర కళాకారుడనే విషయం తెలిసిందే. విరామ సమయంలో ఆయన దేవుళ్ల చిత్రాలను గీస్తూ వాటిని హీరోలకు, సన్నిహితులకు బహుమతిగా ఇస్తుంటారు. కాగా ప్రస్తుతం బ్రహ్మానందం కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ చిత్రంతో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment