సాక్షి, హైదరాబాద్: ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే ఈ నెల 10 వరకు తెలంగాణ హైకోర్టు పొడిగించింది. ధరణి నిబంధనలకు సంబంధించిన మూడు జీవోలపై న్యాయవాది గోపాల్ శర్మ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ధరణి జీవోలపై కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఉత్తర్వులు ఎత్తివేయాలని ఏజీ కోరారు. మధ్యంతర ఉత్తర్వుల వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని కోర్టుకు ఏజీ తెలిపారు. రిజిస్ట్రేషన్లు ఆపాలని ఆదేశించలేదని.. పాత పద్ధతిలో కొనసాగించుకోవచ్చునని హైకోర్టు సూచించింది. సేకరించిన డేటాకు చట్టబద్ధతమైన భద్రత ఉండాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈనెల 10కి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. (చదవండి: కేంద్రం మెడలు వంచుతాం: తలసాని)
Comments
Please login to add a commentAdd a comment