కోలీవుడ్‌కు సచిన్‌ జోషి | sachin joshi enter to kollywood films | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌కు సచిన్‌ జోషి

Published Mon, Mar 27 2017 3:01 AM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM

కోలీవుడ్‌కు సచిన్‌ జోషి

కోలీవుడ్‌కు సచిన్‌ జోషి

టాలీవుడ్, బాలీవుడ్‌లలో ఒక రౌండ్‌ కొట్టి ఇప్పుడు కోలీవుడ్‌కు వస్తున్నారు యువ నటుడు సచిన్‌జోషి. ప్రముఖ వ్యాపారవేత్త సచిన్‌జోషి. ఈయనకు సినిమా చాలా ఫ్యాషన్‌. ఇప్పటికే కథానాయకుడిగా పలు తెలుగు చిత్రాల్లో నటించారు. హిందీలోనూ రామ్‌గోపాల్‌ వర్మ తదితర దర్శకుల చిత్రాల్లో నటించారు. తాజాగా ఇవన్‌ యార్‌ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెలుగులో వీడెవడు అనే పేరును నిర్ణయించారు. టి.సత్య దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటి ఈషాగుప్తా నాయకిగా నటిస్తున్నారు.

ప్రభు, కిశోర్, సతీష్‌  ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ యార్‌ ఇవన్‌ చిత్రానికి ఎస్‌ఎస్‌.తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు శనివారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్‌ తెలిపారు.ఇది కబడ్డీ క్రీడ నేపథ్యంలో సాగే సస్పెన్స్‌తో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం అని చెప్పారు. యార్‌ ఇవన్‌ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు ఆదరిస్తే వరుసగా తమిళ చిత్రాల్లో నటిస్తానని చిత్ర కథానాయకుడు సచిన్‌జోషి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement