
ఆగస్టు 7న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
ఎం.ఎస్. స్వామినాథన్ (వ్యవసాయ శాస్త్రవేత్త), సచిన్ జోషి (హీరో)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధునికి సంబంధించిన సంఖ్య. ఈ రోజు నుండి తదుపరి బర్త్‌డే వరకు వీరిపై బుధుని ప్రభావం ఉంటుంది. బుధసంఖ్య వలన చేసే పనిలో నైపుణ్యం చూపిస్తారు. వీరికి ఈ సంవత్సరం గురు, చంద్ర యోగం; బుధ, గురుల కలయిక వలన చదివిన చదువుకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. వీరు వీరి తాహతుకు మించి పెద్ద వాటికై ప్రయత్నించడం మంచిది. వీరికి అవకాశాలు కూడా అలాగే వస్తాయి. రాజకీయ నాయకులకు చాలా గౌరవమర్యాదలు లభిస్తాయి. పదవులు పొందుతారు. విదేశీయానం చేస్తారు. గ్రీన్‌కార్డ్ లేదా స్థిరనివాసం, ఆస్తిపాస్తుల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. అనూహ్యమైన మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. వీరు 7వ తేదీన పుట్టినందువల్ల వీరిపై కేతు ప్రభావం ఉంటుంది.
కేతువు మోక్ష కారకుడు కాబట్టి వీరికి ప్రాపంచిక జీవనం కన్నా ఆధ్యాత్మిక జీవనంపై మక్కువ కలుగుతుంది. కేతుగ్రహ ప్రతికూల ప్రభావం వల్ల నిద్రలేమి, నరాల బలహీనత కలిగే అవకాశం ఉంది. సంవత్సర సంఖ్య 5. దీని ప్రభావం వల్ల వీరి లక్ష్యాలు నెరవేరతాయి. లక్కీ నంబర్స్: 1,2,5,6,7; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్ర, ఆదివారాలు; లక్కీ కలర్స్: రోజ్, పర్పుల్, గ్రీన్, గోల్డెన్, శాండల్; లక్కీ మంత్స్: మార్చి, మే, సెప్తెంబర్, అక్టోబర్, డిసెంబర్. సూచనలు: గణపతిని, పార్వతీ అమ్మవారిని ఆరాధించడం, కన్నెపిల్లలకు తగిన సాయం చేయడం మంచిది. వ్యాపార, ఆస్తి లావాదేవీలకు సంబంధించిన పత్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు విజ్ఞతతో వ్యహరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్