విడుదలకు రెడీ అవుతున్న బాలీవుడ్ వీరప్పన్
సౌత్ ఇండస్ట్రీని వదిలిపెట్టి బాలీవుడ్లో మకాం వేసిన రామ్ గోపాల్ వర్మ అక్కడ కూడా జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్నాడు. ఈమధ్యే వీరప్పన్ సినిమాను ఎనౌన్స్ చేసిన వర్మ, అప్పుడే ఆ సినిమా రెండో ట్రైలర్ను కూడా రిలీజ్ చేశాడు. సౌత్లో కేవలం వీరప్పన్ కోసం సాగించిన వేటనే కథాశంగా సినిమా రూపొందించిన వర్మ హిందీలో మాత్రం వీరప్పన్ జీవితకథను తెరకెక్కిస్తున్నాడు. సందీప్ భరద్వాజ్తో పాటు సచిన్ జోషి, ఉషా జాదవ్, లిసారే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాతో పాటు కర్ణాటక మాఫియా డాన్ జీవిత కథ ఆధారంగా రాయ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వర్మ. ఈ సినిమాలో రాయ్ పాత్రలో వివేక్ ఒబరాయ్ నటిస్తున్నాడు. వర్మ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను తానే స్వయంగా నిర్మిస్తున్నాడు వివేక్. వీటితో పాటు టాలీవుడ్లో విజయవాడ రౌడీయిజం నేపథ్యంలోవంగవీటి సినిమాను కూడా రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు వర్మ.