'బండ్ల' మనిషి కాదు... తోడేలు... | sachin joshi fires on bandla ganesh | Sakshi
Sakshi News home page

'బండ్ల' మనిషి కాదు... తోడేలు...

Published Mon, Mar 27 2017 6:45 PM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

'బండ్ల' మనిషి కాదు... తోడేలు... - Sakshi

'బండ్ల' మనిషి కాదు... తోడేలు...

హైదరాబాద్‌: సినీ నటుడు సచిన్‌ జోషి, నిర్మాత బండ్ల గణేష్‌ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇటీవల సచిన్‌ జోషి తనను చంపడానికి గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌కు డబ్బు ఇచ్చాడని, నయీమ్‌ చనిపోవడంతో ప్రాణాలతో బ్రతికి పోయానని బండ్ల గణేష్‌ ఆరోపించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా సచిన్‌ జోషి బండ్ల ఆరోపణలపై స్పందించారు. సచిన్‌ ముఖ్యపాత్ర పోషించిన చిత్రం వీడెవడు టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సచిన్‌, బండ్ల ఆరోపణలపై స్పందించారు. "బండ్ల మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న తోడేలు,. ఒరేయ్‌ పండు సినిమా సమయంలో తినడానికి తిండిలేదన్నాడు. నమ్మించి మోసం చేశాడు. అలాంటి వాడితో కలిసి వ్యాపారం చేశాను. కోర్టులో 18 కేసులు వేశాం, సుమారు 27 కోట్లు ఇవ్వాలి. తీరా అరెస్టు చేసే సమయంలో బండ్ల తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడంతో వదిలేయాల్సి వచ్చింది". కోర్టులో కేసులు నడుస్తున్న సమయంలో ఆరోపణలు చేయడం తగదని సచిన్‌ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement