
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెలుతున్న హీరో సందీప్ కిషన్. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తున్న యువ కథానాయకుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను సైలెంట్ గా ఫినిష్ చేసేశాడు. బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ తొలిసారిగా ఓ తెలుగు సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
బాహుబలి లాంటి భారీ చిత్రంలో నటించినా.. తమన్నాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావటం లేదు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సినిమాతో పాటు, సందీప్ కిషన్ సినిమాల్లో మాత్రమే నటిస్తుంది ఈ బ్యూటీ. ఈ సినిమాలో మరో విశేషం ఉంది. ఈ సినిమాను హీరో సచిన్ జోషి నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment