ప్రపంచ కుబేరుల జాబితాలో రెండవ స్థానంలో నిలిచిన 'బెర్నార్డ్ ఆర్నాల్డ్' (Bernard Arnault)కి చెందిన లూయిస్ విట్టన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మధ్య ఒప్పందం జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గ్లోబల్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లూయిస్ విట్టన్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లోని ఉబెర్ లగ్జరీ మాల్ అయిన జియో వరల్డ్ ప్లాజాలో తన కొత్త స్టోర్ కోసం మొత్తం 7,365 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు యూనిట్లను లీజుకు తీసుకుంది. దీనికి నెలకు అద్దె రూ. 40.50 లక్షలు కావడం గమనార్హం.
సంస్థ 60 నెలల లాక్-ఇన్ పీరియడ్‌తో 114 నెలలకు (9.5 సంవత్సరాలు) రూ. 2.43 కోట్ల లైసెన్స్ ఫీజు సెక్యూరిటీ డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కూడా ప్రతి 36 నెలల తరువాత రెంట్ 15 శాతం పెరుగుతుంది. ఈ డీల్ 2023 ఫిబ్రవరి నుంచి 2032 డిసెంబర్ వరకు ఉండనుంది.
ఇదీ చదవండి: మొదటి కుమార్తె మరణం కంటే అది చాలా బాధాకరం - ఎలాన్ మస్క్
1854లో పారిస్‌లో లూయిస్ విట్టన్ స్థాపించిన ఈ కంపెనీ 2003లో న్యూఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో భారతదేశంలో తన మొదటి షాప్ ప్రారంభించింది. అయితే ఈ రోజు బెంగళూరులోని UB సిటీ, న్యూఢిల్లీలోని DLF ఎంపోరియో, దక్షిణ ముంబైలోని హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్‌తో సహా దేశవ్యాప్తంగా మూడు స్టోర్‌లను కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment