శ్రీలంక త్రీవ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో భారత ప్రభుత్వం మరోసారి తన ఆపన్న హస్తం అందించింది. పెట్రోలియం ఉత్పత్తులు కొనుక్కోవడం కోసం ఆ దేశానికి 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఆఫర్ చేసినట్లు కొలంబోలోని భారత హైకమిషన్ వెల్లడించింది. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, శ్రీలంక ఆర్థిక శాఖ మంత్రి బసిల్ రాజపక్స మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ నిర్ణయం వెలువడినట్లు పేర్కొంది. డిసెంబర్ చివరిలో 3.1 బిలియన్ డాలర్లకు కరెన్సీ నిల్వలు పడిపోవడంతో ఆ దేశం మీద రోజు రోజుకి ఒత్తిడి పెరిగిపోతుంది.
నిల్వలను పెంచుకోవడానికి, రుణాన్ని తిరిగి చెల్లించడానికి శ్రీలంకకు 400 మిలియన్ డాలర్ల స్వాప్ ఆర్రేజ్ మెంట్ ను గత వారం భారతదేశం మంజూరు చేసింది. ఇప్పటికే భారత్ ఈ నెల మొదట్లో శ్రీలంకకు 900 మిలియన్ డాలర్ల ఫారెక్స్ సపోర్ట్ ను అందించిందని హైకమిషన్ తెలిపింది. శ్రీలంకలో విదేశీ మారక ద్రవ్యం కొరత కారణంగా ఆహారం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫారెక్స్ సంక్షోభం కారణంగా ఇంధన రంగం దెబ్బతినడంతో నౌకాశ్రయంలో షిప్ మెంట్లు నిలిపివేయడంతో పాటు ఆ విద్యుత్ కోతలు విధించాల్సి వస్తుంది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరగడం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడం, ప్రభుత్వ ఖజానా ఎండిపోవడంతో 2022 దివాళా సంవత్సరంగా మారబోతోందన్న భయాందోళనలు అక్కడ కొనసాగుతున్నాయి.
ఆ దేశంలో ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే.. త్రీవ ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ఉద్యోగాలు పొగొట్టుకుని, ఉపాధి దొరక్క అక్కడి ప్రజలు తిరుగుతున్నారు. ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు తమ అవసరాల కోసం బాకీలు చేయక తప్పడం లేదు. బాకీలు తీర్చే క్రమంలో కొన్ని కుటుంబాలు తిండి తినడం తగ్గించేస్తున్నాయి. ఒక్కరోజుకి సరిపడే సరుకుల్ని వారానికి సరిపెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన దుకాణాలు సైతం యాభై, వంద గ్రాముల స్థాయి ప్యాకింగ్‌లు సైతం సిద్ధమవుతున్నాయి అంటే మనం అర్ధం చేసుకోవచ్చు అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అనేది.
(చదవండి: అనుకోకుండా అదృష్టం.. సెల్ఫీలతో కోటీశ్వరుడు అయ్యాడు)
Comments
Please login to add a commentAdd a comment