![Rupee Edges Higher Against Dollar, But Still Below 72 Mark - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/12/rupee.jpg.webp?itok=9KcQlffd)
ముంబై: అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధభయాలు, పెరుగుతున్న ముడిచమురు రేట్లు, తరలిపోతున్న విదేశీ పెట్టుబడుల మధ్య రూపాయి రోజురోజుకీ కొత్త కనిష్ట స్థాయులకు పడిపోతోంది. డాలర్‌తో పోలిస్తే మంగళవారం మరో 24 పైసలు క్షీణించి ఇంకో రికార్డు కనిష్ట స్థాయి 72.69 వద్ద క్లోజయ్యింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ ఉదయం సెషన్లో కాస్త ఆశావహంగా మొదలై 72.25 గరిష్ట స్థాయిని తాకినప్పటికీ .. ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది.
ఇంట్రాడేలో 72.74 స్థాయికి పడిపోయింది. అయితే, రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో కొంత కోలుకుని చివరికి 0.33 శాతం నష్టంతో 72.69 వద్ద ముగిసింది. కీలకమైన వర్ధమాన దేశాల్లో అమ్మకాల ఒత్తిడి, అది మిగతా దేశాలకు వ్యాప్తి చెందే అవకాశాల తీవ్రతపైనే ప్రభుత్వం విధానపరంగా ఏదైనా నిర్ణయం తీసుకోవడమన్నది. ఆధారపడి ఉంటుందని డీలర్లు అభిప్రాయపడ్డారు. అర్జెంటీనా పెసో, టర్కిష్ లీరా సంక్షోభ ప్రభావం ఆసియా దేశాల కరెన్సీలపై గణనీయంగా ఉంటోందని తెలిపారు. ఇక విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరుపుతుండటం, 2019 సార్వత్రిక ఎన్నికలపై రాజకీయంగా కొంత అనిశ్చితి నెలకొనడం సైతం ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment