
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం మళ్లీ తిరోగమనం బాట పట్టింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో ఒకేరోజు 26 పైసలు పతనమయ్యింది. 73.83 వద్ద ముగిసింది. వరుసగా ఆరు రోజులు ఏ రోజుకారోజు కొత్త రికార్డులతో పతనం బాట పట్టిన రూపాయి, ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు తర్వాత 10,11,12 తేదీల్లో వరుసగా 18, 09, 55 పైసలు చొప్పున మొత్తం 82 పైసలు బలపడింది. అయితే సోమవారం (15వ తేదీ) ట్రేడింగ్‌లో మళ్లీ 26 పైసలు పడిపోయింది.
కారణాలు ఇవీ...
క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా తీవ్ర స్థాయిలోనే కొనసాగుతుండటం, వాల్‌స్ట్రీట్ విలేకరి అదృశ్యానికి సంబంధించి అమెరికా – సౌదీ అరేబియాల మధ్య హఠాత్తుగా ఏర్పడిన ఉద్రిక్తతలు దీనికి నేపథ్యం. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి కనిష్ట స్థాయిలో 73.80 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 74.07 వద్దకూ జారింది. దిగుమతిదారుల నుంచి డాలర్‌కు పెద్ద ఎత్తున వచ్చిన డిమాండ్ దీనికి కారణం. దీనికితోడు దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ కూడా రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment