జైపూర్: త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీ ఓడిపోవడం ఖాయమన్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. గడిచిన ఐదేళ్ళలో మా ప్రభుత్వం అనుసరించిన విధానాలు, మేము చేసిన అభివృద్ధిని మాత్రమే ప్రజలు పరిగణనలోకి తీసుకుంటారు అంతేగాని ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే వారు తిప్పికొడతారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీ ఓడిపోవడం ఖాయమని అన్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.
అదొక్కటే మార్గం..
ఓ మీడియా సంస్థ చేసిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మతసామరస్యాన్ని దెబ్బతీయడం తప్ప బీజేపీ చేయగలిగింది ఏమీ లేదు. వారు కర్ణాటకలో కూడా అదే తంత్రాన్ని ప్రయోగించారు. కానీ అక్కడ వారి ప్రయత్నం కాస్తా బెడిసికొట్టింది. నిన్న అక్కడ జరిగిందే రేపు ఇక్కడ కూడా జరుగుతుంది. వారు గెలవడానికి మతసామరస్యాన్ని దెబ్బతీయడం తప్ప మరో మార్గాన్ని ఎంచుకుంటారని నేననుకోవడంలేదు.
రెచ్చగొట్టడమే తెలుసు..
ప్రచారానికి ప్రధాన మంత్రి మోదీ వచ్చినా అమిత్ షా వచ్చినా వాళ్ళు మతవిద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలే చేస్తారు. దాని వలన వారికి ఒరిగే ప్రయోజనమేమీ ఉండదు. కర్ణాటక ఎన్నికల సమయంలో వారు బజరంగ్ బలి నినాదాలు చేశారు. అయినా కూడా అక్కడ వారి పాచిక పారలేదు. అది చాలా పెద్ద తప్పు. నేరం కూడాను. ఈ విషయాన్ని నేనప్పుడే ప్రస్తావించి ప్రధాన మంత్రి ప్రచారాన్ని అడ్డుకోవాలని ఎన్నికల కమిషన్ కు కూడా విజ్ఞప్తి చేశాను.
ప్రజలకు అన్నీ తెలుసు..
రేపు ఇక్కడ జరగబోయే ఎన్నికల్లో కూడా వారు ఇదే తరహా ప్రచారానికి తెరతీసినా ఆశ్చర్యపోనక్కరలేదు. అది వారి నైజం. కానీ ఇక్కడి ప్రజలు వారి మాటలను నమ్మే పరిస్థితి లేదు. గడిచిన ఐదేళ్ళలో ఇక్కడ జరిగిన అభివృద్ధి, ఆడబిడ్డల సంక్షేమం,విద్య, వైద్యం, మంచినీటి సదుపాయాలకు పెద్దపీట వేస్తూ మేము అవలంబించిన విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయని అన్నారు.
ఇది సమయం కాదు..
తనకూ సచిన్ పైలట్ కు మధ్య విభేదాల గురించి ప్రస్తావించగా రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే వంటి ముఖ్య నేతల సమక్షంలో మేము మాట్లాడుకున్నాం. అది పూర్తిగా మా అంతర్గత వ్యవహారం. దాని గురించి ఇప్పుడు మాట్లాడి అనవసర వివాదాలకు తావివ్వకూడదని అనుకుంటున్నానని తెలివిగా మాట దాటవేశారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై.. సచిన్ పైలట్ కొత్త పార్టీ?
Comments
Please login to add a commentAdd a comment