రాజస్తాన్‌లో కాంగ్రెస్‌కి ఊహించని విధంగా షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. అక్కడ కాంగ్రెస్‌లో అంతర్గత పోరుతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్‌కి వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ నిరసకు దిగిన ఘటన మరువుక మునుపే మరో గట్టి దెబ్బను ఎదుర్కొంటోంది కాంగ్రెస్. బీజేపీ కాంగ్రెస్‌పై వరుస అవినీతి ఆరోపణల చేస్తున్న తరుణంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తోంది.
జైపూర్‌లోని 38 ఏళ్ల రామ్ ప్రసాద్ మీనా అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆ వ్యక్తి ఓ హోటల్ యజమానితో భూవివాదంలో చిక్కుకున్నాడు. ఈ మేరకు తన స్థలం నుంచి తనను ఖాళీ చేయమంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ కాంగ్రెస్ మంత్రి మహేశ్ జోషి తోపాటు మరికొందరూ వ్యక్తులపై ఆరోపణలు చేస్తూ ఓ వీడియో సందేశాన్ని రికార్డు చేశాడు బాధితుడు. వాస్తవానికి మీనా అనే వ్యక్తి దశాబ్దానికి పైగా ఆలయ ట్రస్ట్‌కి చెందని భూమిలోనే నివశిస్తున్నాడు. ఆ వీడియోలో.. "తాను కేబినేట్ మంత్రి మహేష్ జోషి, అతని సహచరులు కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నా. వారు నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో వేధించారు. వేరే మార్గం లేక ఇలా చేస్తున్నా". అని పేర్కొన్నాడు బాధితుడు మీనా.
అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదే అదనుగా బీజేపీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ. కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. జోషి రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అంతేగాక బాధితుడు వర్గానికి చెందని బీజేపీ రాజ్యసభ్య సభ్యుడు కిరోరి లాల్ మీనా చనిపోయిన వ్యక్తికి మద్దతు ఇస్తూ..డిమాండ్ నెరవేరే వరకు మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించమని చెప్పారు. కాగా, సచిన్‌పైలట్ బాధితుడి కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ.. సదరు రాజ్యసభ సభ్యుడు కిరోరి లాల్ మీనాతో కలిసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని ఈఘటన ఇరకాటంలో పడేసిందనే చెప్పాలి.
(చదవండి: 'మహమ్మారి ఇంకా ముగియలేదు'..అప్రమత్తంగా ఉండండని కేంద్రం లేఖ)
Comments
Please login to add a commentAdd a comment