జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ గొప్ప మనసు చాటుకున్నారు. తెల్లవారితే పోలింగ్ ఉన్నప్పటికీ.. అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ ఎమ్మెల్యేను అర్ధరాత్రి పరామర్శించారు. ఎన్నికల వేళ నిత్యం బిజీగా ఉన్నప్పటికీ రాత్రి 1 గంటల సమయంలో ఆస్పత్రికి వెళ్లి బీజేపీ ఎమ్మెల్యే బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
బీజేపీ ఎమ్మెల్యే జిజి వ్యాస్ అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం ఆమెకు ఎయిమ్స్‌లో చికిత్స కొనసాగుతోంది. నేడు రాష్ట్రంలో పోలింగ్ జరగనున్నప్పటికీ అర్ధరాత్రి సమయంలో సీఎం అశోక్ గహ్లోత్ అనారోగ్యం పాలైన జిజి వ్యాస్‌ను పరామర్శించారు. అర్ధరాత్రి 1 గంటలకు ఎయిమ్స్‌కు వెళ్లి జిజి వ్యాస్‌ను పలకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. గహ్లోత్‌ను రాజస్థాన్ వజ్రంగా పేర్కొన్నారు నెటిజన్లు. మూడోసారి రాష్ట్రంలో అపూర్వ విజయం సాధించాలని ఆకాంక్షించారు.
It's almost 1 AM, tomorrow is polling in Rajasthan and Ashok Gehlot is meeting the BJP MLA in AIIMS.
— Amock (@Politics_2022_) November 24, 2023
BJP MLA Jiji Vyas is admitted with health conditions and Pope has reached her to meet & check on her.♥️
Pictures are going viral in Marwad region, what a leader what a gem… pic.twitter.com/hiGahaiZxi
రాజస్తాన్ శాసనసభ ఎన్నికలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరుగనుంది. 200 నియోజకవర్గాలకు గాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్‌పూర్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గురీత్‌సింగ్ కూనార్ మరణించడంతో ఇక్కడ పోలింగ్‌ను వాయిదా వేశారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 1,862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఇదీ చదవండి: మరోసారి గెలుపు మాదే: సచిన్ పైలెట్
Comments
Please login to add a commentAdd a comment