న్యూఢిల్లీ: దీపావళికి ముందే దేశరాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్‌లా మారింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా స్థానికులు పలు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు.
విపరీతమైన వాయు కాలుష్యం కారణంగా వృద్ధులు, చిన్నారులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు(శనివారం) ఉదయం నుండే ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌తో సహా పలు చోట్ల పొగమంచు కమ్ముకుంది.
ఢిల్లీ వాతావరణంలో గతంలో కన్నా స్వల్ప మెరుగుదల కనిపించింది. టాప్-10 కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఏక్యూఐ240తో మొదటి, రెండవ స్థానాల నుండి 7వ స్థానానికి చేరుకుంది. దేశంలోని కాలుష్య నగరాల జాబితా ప్రకారం చూస్తే ఢిల్లీ ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతం ఏక్యూఐ 364తో వాయు నాణ్యత విషయంలో దారుణంగా ఉంది. ఏక్యూఐ ఉదయం 6 గంటలకు 364 వద్ద నమోదైంది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యత తక్కువగా ఉండడానికి పంజాబ్-హర్యానాతో సహా పొరుగు రాష్ట్రాలలో గడ్డి తగులబెట్టడమే ప్రధాన కారణం. ప్రతి ఏటా ఈ సీజన్‌లో ఢిల్లీలోని గాలి విషపూరితంగా మారుతుంటుంది. దీపావళికి ముందే గాలిలో విషవాయువులు పెరుగుతున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) డేటాను పరిశీలిస్తే 2021 సంవత్సరం నుండి ఇప్పటివరకు ప్రతీ అక్టోబర్‌లో కాలుష్య స్థాయి పెరిగింది.
ఇది కూడా చదవండి: ఒడిశాకు తప్పిన తుఫాను ముప్పు: సీఎం మోహన్
Comments
Please login to add a commentAdd a comment