very poor
-
దీపావళికి ముందే గ్యాస్ ఛాంబర్లా రాజధాని
న్యూఢిల్లీ: దీపావళికి ముందే దేశరాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా స్థానికులు పలు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు.విపరీతమైన వాయు కాలుష్యం కారణంగా వృద్ధులు, చిన్నారులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు(శనివారం) ఉదయం నుండే ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌తో సహా పలు చోట్ల పొగమంచు కమ్ముకుంది.ఢిల్లీ వాతావరణంలో గతంలో కన్నా స్వల్ప మెరుగుదల కనిపించింది. టాప్-10 కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఏక్యూఐ240తో మొదటి, రెండవ స్థానాల నుండి 7వ స్థానానికి చేరుకుంది. దేశంలోని కాలుష్య నగరాల జాబితా ప్రకారం చూస్తే ఢిల్లీ ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతం ఏక్యూఐ 364తో వాయు నాణ్యత విషయంలో దారుణంగా ఉంది. ఏక్యూఐ ఉదయం 6 గంటలకు 364 వద్ద నమోదైంది.ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత తక్కువగా ఉండడానికి పంజాబ్-హర్యానాతో సహా పొరుగు రాష్ట్రాలలో గడ్డి తగులబెట్టడమే ప్రధాన కారణం. ప్రతి ఏటా ఈ సీజన్లో ఢిల్లీలోని గాలి విషపూరితంగా మారుతుంటుంది. దీపావళికి ముందే గాలిలో విషవాయువులు పెరుగుతున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) డేటాను పరిశీలిస్తే 2021 సంవత్సరం నుండి ఇప్పటివరకు ప్రతీ అక్టోబర్‌లో కాలుష్య స్థాయి పెరిగింది.ఇది కూడా చదవండి: ఒడిశాకు తప్పిన తుఫాను ముప్పు: సీఎం మోహన్ -
ఢిల్లీకి ‘గాలాడటం’ లేదు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు నాణ్యత ఈ సీజన్లో మొదటిసారిగా ఆదివారం ‘వెరీ పూర్’ స్థాయికి పడిపోయింది. శనివారం 248గా ఉన్న సగటు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 24 గంటల వ్యవధిలో 313కు పడిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణ మని అధికారులు చెబుతున్నారు. దాంతో ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్ సోమవారం సంబంధిత శాఖలతో సమీక్ష జరపనున్నారు. ప్రైవేటు వాహనాల రాకపోకలను వీలైనంతగా తగ్గించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రయతి్నస్తోంది. ఇందులో భాగంగా పార్కింగ్ ఫీజులు పెంచడం వంటి చర్యలు చేపట్టింది. హోటళ్లలో తందూరీ పొయ్యిలపై నిషేధం విధించింది. సీఎన్జీ, ఎలక్రి్టక్ బస్సుల వినియోగాన్ని, మెట్రో రైలు సరీ్వసుల సంఖ్యను పెంచాలని కోరింది. ఢిల్లీకి 300 కిలోమీటర్ల పరిధిలోపలున్న కాలుష్య కారఖ పారిశ్రామిక యూనిట్లు, ధర్మల్ విద్యుత్ ప్లాంట్లను మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిర్మాణాలు జరుగుతున్న, కూలి్చవేత ప్రాజెక్టులు చేపట్టిన చోట్ల దుమ్ము రేగకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
ఉన్నత చదువులే లక్ష్యంగా..
తూరంగి పాఠశాల విద్యార్థుల ప్రతిభ వారి కలల సాకారం దిశగా విద్యా బోధన తూరంగి (కాకినాడ రూరల్) : చక్కని ప్రణాళిక, అంకిత భావంతో పని చేస్తూ అక్కడి ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను చక్కగా బోధిస్తున్నారు. విద్యార్థులు సైతం అదే పట్టుదలతో కృషి చేస్తున్నారు. పాఠ్యాంశాలే కాకుండా, ప్రయోగపూర్వకంగా అంశాలు బోధిస్తూ సత్ఫలితాలు పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులు ఉచిత ఇంటర్మీడియట్ విద్యతోపాటు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ విద్యకు ఇక్కడి పాఠశాల విద్యార్థులు అర్హత సాధిస్తుండడమే కాక, ఆరేళ్లుగా నూజివీడు, ఇడుపులపాయ, బాసర ట్రిపుల్ ఐటీల్లో సీట్లను సాధిస్తున్నారు. ట్రిపుల్ ఐటీకి చిరునామా.. తూరంగిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ట్రిపుల్ ఐటీ సాధనకు చిరునామాగా మారింది. 2011లో ఇద్దరు, 2012, 13లో ఒక్కొక్కరూ, 14లో ఇద్దరు, 15లో ఇద్దరు, 16లో ఇద్దరు విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు పొందారు. ఈ విద్యా సంవత్సరం 180 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఇందులో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో విద్యను బోధిస్తున్నారు. సకాలంలో సిలబస్ పూర్తిచేస్తున్న ఉపాధ్యాయులు అంతటితో సరిపెట్టక ప్రధాన అంశాలపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం అదనపు వేళలను విద్యార్థుల కోసం కేటాయిస్తూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. -
కార్లు తగ్గించినా.. కాలుష్యం తగ్గలేదు
న్యూఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో 'సరి - బేసి' కార్ల ప్రయోగాన్ని ఢిల్లీ సర్కారు ప్రవేశపెట్టినా కాలుష్యం మాత్రం పెద్దగా తగ్గలేదు. ఈ పథకాన్ని శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకువచ్చినా... వాహన కాలుష్యం మాత్రం గతంలో మాదిరిగానే ఉంది. వాతావరణంలో కాలుష్యం అలాగే ఉందని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ (సఫర్)కు చెందిన ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. అయితే శుక్రవారం ఉదయం కంటే సాయంత్రానికి కాలుష్యం చాలా తగ్గిందని ఆప్ వర్గాలు చెప్పడం విశేషం. నగరంలో వాయు కాలుష్యం తగ్గలేదని వివిధ ప్రదేశాల్లోని సఫర్ స్టేషన్లల్లో ఏర్పాటు చేసిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెల్లడించిందని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ పేర్కొంది. గురువారంతో పోలిస్తే... శుక్రవారం కూడా వాయుకాలుష్యంలో అదే స్థాయిలో ఉందని చెప్పింది. న్యూఢిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆప్ ప్రభుత్వం సరి - బేసి కార్ల ప్రయోగాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. జనవరి 1-15 తేదీల మధ్య ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నారు. తొలిరోజు చాలావరకు బేసి సంఖ్య వాహనాలే రోడ్లపైకి వచ్చాయి. అయితే.. అక్కడక్కడ సరి సంఖ్య నంబరు వాహనాలు కూడా వచ్చాయి. దీంతో ఢిల్లీ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం సదరు వాహనాలకు రూ.2 వేల చొప్పున జరిమానా విధించారు.