
న్యూఢిల్లీ: ఉదయం నడక మానండి..టపాసులు కాల్చకండి..ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోండి.. వాయు కాలుష్యం కొనసాగుతున్న వేళ దేశ రాజధాని వాసులకు ఢిల్లీ ఆరోగ్య శాఖ జారీ చేసిన సూచనలివి. శనివారం అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో ఈ మేరకు సూచనలు ప్రచురించింది. ఇక కాలుష్యంతో రెండు వారాలుగా ఇబ్బంది పడుతున్న జనానికి వర్షం ఊరట ఇచ్చింది. దేశ రాజధాని ప్రాంతంలో గురువారం వాయు నాణ్యత ఇండెక్స్(ఏక్యూఐ) 437 కాగా, శనివారం ఉదయం ఏక్యూఐ 219కి పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment