crackars
-
నీరుగారిన నిషేధం: పేలిన టపాసులు, ఎగిరిన తారాజువ్వలు!
ఢిల్లీ-ఎన్సీఆర్లో కాలుష్య నియంత్రణకు సుప్రీంకోర్టు బాణాసంచాపై నిషేధం విధించింది. అయితే ఢిల్లీవాసులు ‘సుప్రీం’ ఆదేశాలను ధిక్కరించి, యధేచ్ఛగా బాణాసంచా వెలిగించారు. దీపావళి రోజు రాత్రి జనమంతా టపాసులు కాల్చడంతో ఢిల్లీ అంతటా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఫలితంగా నగరం అంతటా విపరీతమైన కాలుష్యం ఏర్పడింది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో వెలిగించిన బాణసంచా కారణంగా దట్టమైన పొగ కమ్ముకుని, విజిబులిటీ గణనీయంగా తగ్గిపోయింది. కాస్త దూరం ఉన్న దృశ్యాలను చూడటం కూడా కష్టతరంగా మారింది. సోషల్ మీడియాలోని వివిధ సైట్లలో షేర్ అవుతున్న తాజా పోస్ట్‌లను పరిశీలిస్తే పెద్ద సంఖ్యలో ప్రజలు టపాసులు కాల్చినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి లోధీ రోడ్, ఆర్కె పురం, కరోల్ బాగ్, పంజాబీ బాగ్‌లకు సంబంధించిన ఫొటోల్లో బాణాసంచా వెలుగులు, ఆకాశాన్ని కాంతులతో ముంచేసిన దృశ్యాలు కనిపించాయి. గత కొన్ని వారాలుగా దేశ రాజధాని కాలుష్యంతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. కాలుష్యం చాలాచోట్ల ‘తీవ్రమైన’ కేటగిరీలో ఉంది. దీపావళి తర్వాత దేశ రాజధానిలో మరోసారి కాలుష్య స్థాయిలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇది స్థానికులను మరిన్ని ఇబ్బందులకు గురిచేయనుంది. ఇటీవల ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం బాణసంచాపై సంపూర్ణ నిషేధం విధించింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కాలుష్య స్థాయిలను తగ్గించేందుకు ‘కృత్రిమ వర్షం’ కురిపించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇది కూడా చదవండి: అయోధ్యా నగరం! ఫొటోలను షేర్ చేసిన ప్రధాని మోదీ #WATCH | People burst firecrackers in Delhi on the occasion of #Diwali (Drone visuals, shot at 12:00 am) pic.twitter.com/rXE8NP80em — ANI (@ANI) November 12, 2023 -
Delhi Air pollution: ఉదయం నడక మానండి.. టపాసులు కాల్చకండి..
న్యూఢిల్లీ: ఉదయం నడక మానండి..టపాసులు కాల్చకండి..ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోండి.. వాయు కాలుష్యం కొనసాగుతున్న వేళ దేశ రాజధాని వాసులకు ఢిల్లీ ఆరోగ్య శాఖ జారీ చేసిన సూచనలివి. శనివారం అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో ఈ మేరకు సూచనలు ప్రచురించింది. ఇక కాలుష్యంతో రెండు వారాలుగా ఇబ్బంది పడుతున్న జనానికి వర్షం ఊరట ఇచ్చింది. దేశ రాజధాని ప్రాంతంలో గురువారం వాయు నాణ్యత ఇండెక్స్(ఏక్యూఐ) 437 కాగా, శనివారం ఉదయం ఏక్యూఐ 219కి పడిపోయింది. -
గ్రీన్ టపాసులూ హానికరమే? అధ్యయనంలో ఏం తేలింది?
కోర్టులు, ప్రభుత్వాలు పర్యావరణ అనుకూల గ్రీన్ క్రాకర్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి. అయితే తాజా అధ్యయనాల్లో గ్రీన్ క్రాకర్స్‌కు సంబంధించిన 63 శాతం నమూనాలలో బేరియంతో పాటు ఇతర ప్రమాదకరమైన రసాయన మూలకాలు ఉన్నాయని తేలింది. ఇవి మన ఆరోగ్యానికి అత్యంత హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీపావళి వేడుకలు సమీపిస్తున్న సమయంలో వెల్లడైన ఈ అధ్యయనం టపాసుల విక్రేతల ఉత్సాహాన్ని చల్లార్చేలా ఉంది. ఈ తరహా గ్రీన్ క్రాకర్స్ విక్రయాలను నిలిపివేయాలని ఈ అధ్యయనం చేపట్టిన సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. సీఎస్ఐఆర్ నీరి అధికారిక గ్రీన్ లోగోతో మార్కెట్లోకి విడుదల చేసిన టపాసులు తక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతాయని ఆ సంస్థలు చెబుతున్నాయి. ప్రభుత్వేతర సంస్థలు, ఆవాజ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో గ్రీన్ టపాసులలో బేరియం, ఇతర ప్రమాదకరమైన రసాయన మూలకాలు ఉన్నట్లు తేలింది. ఇవి మనిషి ఆరోగ్యాన్ని హరింపజేస్తాయి. దేశవ్యాప్తంగా బేరియం వ్యాపింపజేసే పటాకులను నిషేధించారు. సాంప్రదాయ బాణసంచాలో వెలువడే మెటల్ ఆక్సైడ్ బేరియం అనేది శబ్ద కాలుష్యంతోపాటు కళ్ళు, ముక్కు, గొంతు, చర్మం ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది. ఇది కూడా చదవండి: ఆకాశానికి నిచ్చెనొద్దు.. చంద్రునికి తాడు బిగించి.. -
దేశ రాజధానిలో టపాసులపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దీపావళికి టపాసులు కాల్చడంతోపాటు అమ్మకాలను కూడా నిషేధిస్తున్నట్లు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. ‘‘ప్రజలకు స్వచ్ఛమైన గాలిని పీల్చుకొనే హక్కు ఉంది’’ అని పేర్కొన్న ఎన్జీటీ దేశ రాజధానితోపాటు గాలి నాణ్యత చాలా తక్కువగా ఉన్న నగరాల్లోనూ నిషేధాజ్ఞలు ఉంటాయని పేర్కొంది. ఈ నిబంధనలు సోమవారం అర్ధరాత్రి నుంచి నవంబర్ 30 అర్ధరాత్రి వరకు అమలులో ఉంటాయని తెలిపింది. గాలి నాణ్యత మోడరేట్ నుంచి కింది స్థాయి ఉన్న నగరాల్లో హరిత క్రాకర్స్‌కు అనుమతిచ్చింది. టపాసులు కాల్చడం ద్వారా దేశ రాజధాని ప్రాంతంలో వచ్చే కాలుష్యంపై నివారణ చర్యలు కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను విచారించిన జస్టిస్ ఆదర్శకుమార్ గోయెల్ ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. ఆదేశాల్లో ముఖ్యాంశాలు ► దేశరాజధాని పరిధిలో ఈనెల 9 అర్ధరాత్రి నుంచి 30 అర్ధరాత్రి వరకు అన్ని రకాల క్రాకర్స్ అమ్మకం, కాల్చడంపై నిషేధం విధించడం. ► గతేడాది నవంబర్‌లో గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా గాలి నాణ్యత పూర్ ఆపై స్థాయి ఉన్న అన్ని నగరాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ► గాలి నాణ్యత మోడరేట్ అంతకన్నా తక్కువస్థాయి ఉన్న నగరాల్లో దీపావళి, ఛట్, క్రిస్మస్, న్యూఈయర్ సందర్భంగా ఆయా రాష్ట్రాలు తమ నిబంధనల ప్రకారం కేవలం 2 గంటలపాటు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు. టపాసులు నో.. చిచ్చుబుడ్లు ఓకే టపాసుల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు శివసేన నాయకత్వంలోని ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) ప్రకటించింది. తక్కువ కాలుష్యం విడుదల చేసే టపాకాయలను, చిచ్చుబుడ్లను ఇళ్ళవద్ద కాల్చవచ్చునని బీఎంసీ తెలిపింది. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఈ చర్యలు చేపట్టినట్లు బీఎంసీ తెలిపింది. -
పలు రాష్ట్రాల్లో బాణసంచాపై నిషేధం
న్యూఢిల్లీ: దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు బాణసంచా కాల్చడాన్ని నిషేధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తే , మరికొన్ని రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న కాలుష్య కారక టపాసులు కాల్చడంపై నిషేధం విధించాయి. కరోనా వైరస్ విజృంభణ, కాలుష్యం పెరిగిపోతూ ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. టపాసులపై నిషేధం విధించిన రాష్ట్రాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా, రాజస్తాన్, సిక్కిం, కర్ణాటక ఉన్నాయి. బాణసంచా కాల్చడంతో వాయుకాలుష్యం పెరిగి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని, కోవిడ్ విజృంభిస్తున్న వేళ టపాసులు కాల్చడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు తేల్చి చెప్పడంతో పలు రాష్ట్రాలు బాణసంచాపై నిషేధం విధించాయి. ఢిల్లీలో నవంబర్ 30 వరకు బాణసంచా కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.. ఒక్కో రాష్ట్రం బాణసంచా కాల్చడంలో నిషేధం విధించడంతో తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలో బాణసంచాలో 90% తమిళనాడులోని శివకాశి ఇతర ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతూ ఉండడంతో చాలా మంది ఉపాధి కోల్పోతారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం పెరగకుండా చూడండి: సుప్రీంకోర్టు ఢిల్లీలో రోజురోజుకి కాలుష్యం పెరిగిపోతూ ఉండడంతో దానిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీపావళి పండుగ నేపథ్యంలో రాజధానిలో కాలుష్యం పెరిగిపోతోందంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన బెంచ్ వీలైనంత త్వరగా కాలుష్య నివారణకు ఏర్పాట్లు చెయ్యాలని ఆదేశించింది. -
బాణసంచా పేలుడు: పదికి చేరిన మృతులు
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని పెన్నానది పొర్లుకట్ట ప్రాంతంలో గత శనివారం జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఇప్పటికే ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందగా.. గురువారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి మరణించాడు. ప్రస్తుతంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
నిప్పురవ్వలు ఎగిసి.. పది ఇళ్లలో పేలుళ్లు
-
బ్రేకింగ్:నెల్లూరు జిల్లాలో విషాదం
-
నిప్పురవ్వలు ఎగిసి.. పది ఇళ్లలో పేలుళ్లు
నెల్లూరు జిల్లాలో విషాదం బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు నెల్లూరు: నెల్లూరు జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు నగర శివార్లలోని పొర్లుకట్ట సమీపంలో ఉన్న ఓ ఇంట్లో బాణసంచా పదార్థాల వల్ల పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు మృతిచెందారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఓ ఇంట్లో వంట చేస్తుండగాస నిప్పు రవ్వలు ఎగిరిపడి.. బాణాసంచాకు అంటుకోవడంతో వరుసగా 10 ఇళ్లలో పేలుళ్లు సంభవించాయి. ఉదయం 9.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నెల్లూరు ఘటనపై ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులను ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యే కోటంరెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి, డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్ తదితరులు పరామర్శించారు. బాణాసంచా తయారీదారుల్లో చాలామంది వద్ద లైసెన్సులు లేవని తెలుస్తోంది. వరుసగా బాణాసంచా పేలుళ్ల ఇక్కడ జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ విశాల్ సంఘటనాస్థలాన్ని సందర్శించారు.