ఢిల్లీ వాయు నాణ్యత రోజురోజుకీ మరింత క్షీణించిపోతుంది. తేలికపాటి వానజల్లులు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ గురువారం నుంచి గాలి నాణ్యత మళ్లీ క్షీణించడం ప్రారంభమయ్యిందని యిర్ క్వాలిటీ ఇండెక్స్ వెల్లడించింది. తాజాగా ఆదివారం వాయు కాలుష్యం అధిక స్థాయిలో నమోదయ్యినట్లు నివేదికలో తెల్పింది.
పంట వ్యర్ధాలను తగులబెట్టడం వల్ల వెలువడిన పొగ కారణంగానే ఆదివారం హఠాత్తుగా 14 శాతం కాలుష్య రేటు నమోదయ్యింది. నిజానికి ఆరోజున వర్షం పడవల్సి ఉంది. అలాపడివుండే గాలి నాణ్యత కూడా కొంత మెరుగుపడి ఉండేది.
చదవండి: ఎడమచేతివాటం వారు ఈ విషయాల్లో నిష్ణాతులట.. మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు..!
ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డేటా ప్రకారం పంజాబ్‌లోనే గత రెండు రోజుల్లో 1089 పంటల వ్యర్థాలను తగులబెట్టిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. అలాగే యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానాలలో మొత్తంగా 1789 తేలాయి. ఇలా పొరుగు రాష్ట్రాల ప్రభావం పరోక్షంగా ఢిల్లీలో వాయుకాలుష్యానికి కారణమౌతున్నాయి. గత 10 రోజుల్లో జరిగిన సంఘటనల కంటే రెండు రోజుల్లో నమోదైన పంట వ్యర్థాల తాలుకు పొగ మరింత పెరిగినట్లు డేటా వెల్లడించింది.
సాధారణంగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వరి కోతలు ఉంటాయి. అనంతరం గోధుమ, బంగాళాదుంపలను సాగు చేయడం ప్రారంభిస్తారు. అందుకు పంట అవశేషాలను త్వరగా తొలగించాలని రైతులు తమ పొలాల్లోని వ్యర్థాలకు నిప్పు పెడతారు. ఢిల్లీ - ఎన్‌సిఆర్‌లో కాలుష్యం ఆందోళనకరంగా పెరగడానికి ఇది ఒక ప్రధాన కారణమని తాజా అధ్యయనాలు వెల్లడించాయి.
చదవండి: Health Tips: ఎసిడిటీ బాధలు వేధిస్తున్నాయా? వాము, ధనియాలు, తేనె.. ఇంకా..
Comments
Please login to add a commentAdd a comment