జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో తొలి సమావేశం (ఫైల్ ఫొటో)
ఒక దేశ రాజకీయ నిర్మాణంలో వివిధ స్థాయులలో ఏకకాల ఎన్నికల కంటే అసెంబ్లీలకు, పార్లమెంట్ ఎన్నికలకు వేర్వేరు నిర్ణీత తేదీలు ఉండటం సర్వ సాధారణం. అయితే, భారత్‌లో ఆసక్తికరంగా లోక్‌సభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి పెద్ద ఎత్తున ప్రయ త్నాలు జరుగుతున్నాయి. కానీ, పార్లమెంటరీ కమిటీ నిశ్చితాభిప్రాయం ఏమిటంటే, రెండు దశల్లో ఎన్నికలు జరగాలన్నదే! కొన్ని రాష్ట్రాలకు లోక్‌సభ పదవీ కాలం మధ్యలోనూ, మరికొన్నింటికి లోక్‌సభతోపాటు ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, పదేపదే జరిగే ఎన్నికల ద్వారా అనవ సరంగా సమయం, ఖర్చు చేయకూడదనే ఆలోచన నుంచి వచ్చిన ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం అనేది దాని అమలు సాధ్యతపైనే ఆధారపడి ఉంది.
ఒక దేశం, ఒకే ఎన్నిక’ విధానం అమలుకు రాజ్యాంగ సవరణలు, ఇతర పరిశీలనల విషయమై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ... దీనికి సంబంధించి ప్రజల సూచనలను కోరింది. ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ అనే ఆలోచనకు ప్రధాన కారణం సమయం, ఖర్చు, ఆదా చేయడం. ఈ రెండు అంశాలు ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తాయి. కానీ, సమాఖ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలలో దాదాపు ఎక్కడా సమాఖ్య స్థాయిలో, ప్రాంతీయ (రాష్ట్ర) స్థాయులలో ఏకకాల ఎన్నికలు జరగడం లేదు. నిజానికి సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం– న్యాయంపై ఏర్పర్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ఏకకాల ఎన్నికల అంశాన్ని పరిశీలించిన 79వ నివేదిక... ప్రపంచవ్యాప్తంగా దక్షిణాఫ్రికా, స్వీడన్ దేశాల్లోని రెండు కేసులను మాత్రమే ఉదాహరించింది.
సార్వత్రిక వయోజన ఓటు హక్కును ప్రతి పాదిస్తున్న దక్షిణాఫ్రికాలో ఎన్నికలు 1994లో మాత్రమే ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర పోరా టానికి నాయకత్వం వహించిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్... సమాఖ్య, ప్రాంతీయ స్థాయులలో (వెస్ట్రన్ కేప్ మినహా) దేశమంతటా విజయం సాధించడం కొనసాగించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి 25 ఏళ్లలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా గెలుస్తూ వచ్చిన భారతదేశ పరి స్థితికి ఇది భిన్నమైనది కాదు. భారతదేశంలో మరింత స్పర్థాత్మక రాజకీయ దృశ్యం కారణంగా, ఆ తర్వాత హంగ్ అసెంబ్లీలు (హంగ్ పార్లమెంటు కూడా), పార్టీని మొత్తంగా ఖాళీ చేసి వేరే పార్టీలోకి గెంతేయడం (ఫ్లోర్ క్రాసింగ్) మొదలైనవి కనిపించడం ప్రారంభమైంది. ఫలితంగా చట్టసభల రద్దు, ఎన్నికలు, వివిధ సమయాల్లో పార్లమెంటుకు, రాష్ట్రాలకు (శాసనసభ లేకుండా) ఆరు నెలల కంటే ఎక్కువ విరామం ఏర్పడుతూ వచ్చింది.
కేంద్రంలో, రాష్ట్రాలలో ఇలాంటి స్థితి ప్రజాస్వా మ్యానికి ఆమోదయోగ్యం కాదు. పైగా భారత రాజ్యాంగం దీనికి అనుమతించదు. స్వీడన్ విషయానికి వస్తే ఆ దేశం మునిసి పాలిటీలు, రీజియన్లలో ఏకీకృత ప్రభుత్వాన్ని కలిగి ఉంది, కానీ రీజియన్‌లలో మాత్రం ఫెడరల్ వ్యవస్థలోని ప్రావిన్సుల వలె ఉండదు. పైగా వాటి మధ్యన క్రమానుగత సంబంధం లేదు. ముఖ్యంగా, రెండూ వేర్వేరు రకాల పనులను చేపట్టే స్థానిక ప్రభుత్వ రూపాలు. స్వీడిష్ రాజ్యాంగం ముందస్తు ఎన్నికలను అనుమతిస్తుంది. అయితే ఇవి రద్దు అయిన కాలం నుండి మిగిలి ఉన్న కాలానికి మాత్రమే పరిమిత మవుతాయి.
ఒక దేశంలోని రాజకీయ నిర్మాణంలో వివిధ స్థాయులలో ఏకకాల ఎన్నికల కంటే అసెంబ్లీలు, సమాఖ్య పార్లమెంట్‌ల ఎన్నికలకు నిర్ణీత తేదీలు ఉండటం చాలా సాధారణ లక్షణం. పార్లమెంటరీ ప్రభుత్వ రూపాన్ని కలిగి ఉన్న కెనడా సమాఖ్య వ్యవస్థ ఫెడరల్ స్థాయిలోనూ, దాని ప్రావిన్సు లలోనూ రెండు చట్టాలను రూపొందించింది. ఎన్నికల నిర్వహణకు ఒక నిర్ణీత తేదీని ప్రతి పాదిస్తుంది, ఆ తేదీ ప్రావిన్స్ నుండి ప్రావిన్స్కు మారుతూ ఉంటుంది. ఫెడరల్ ఎన్నికల షెడ్యూల్ వేరొక దానిని అనుసరిస్తుంది. ఆస్ట్రేలియాలో ఫెడ రల్ పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల (వాటిలో చాలా వరకు) కాలావధులు వరుసగా మూడు, నాలుగు సంవత్సరాలు ఉంటాయి. తద్వారా అక్కడ జమిలి ఎన్నికలను మినహాయించారు.
‘నిర్దిష్ట తేదీ, పదవీకాలం’ ఎన్నికల నమూనా తక్షణమే అమెరికాను గుర్తు చేస్తుంది. అక్కడ అధ్యక్ష, గవర్నర్ ఎన్నికలు ప్రతి నాలుగు సంవ త్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతాయి. అధ్యక్షుడు లేదా గవర్నర్ పని చేయనట్లయితే వారి స్థానంలోకి రాగల యోగ్యత ఉన్నవారి కోసం ఒక వ్యవస్థ అమలులో ఉంది. ఆ ప్రక్రియ ద్వారా పూర్తి కాలాన్ని కొనసాగించడం సాధ్యమవుతుంది, అయితే ఇది కొన్నిసార్లు ‘ప్రజల స్థాయిలో’ ఎన్ని కల్లో పోటీ చేయకుండానే 1974లో గెరాల్డ్ ఫోర్డ్ అధ్యక్షుడిగా మారడం వంటి క్రమరాహిత్యాలకు దారి తీస్తుంది. అంతేకాకుండా, ప్రతి రెండు సంవ త్సరాలకు ఒకసారి అమెరికా కాంగ్రెస్‌లో, రాష్ట్రాల అసెంబ్లీలలో ప్రతినిధుల సభకు ఎన్నికలు జరుగు తాయి. ప్రైమరీలకు సంబంధించి అమెరికన్ సంప్ర దాయం ప్రకారం, దేశం ఆచరణాత్మకంగా ప్రతి సంవత్సరం ఎన్నికల మోడ్‌లో ఉంటుంది.
భారత్‌లో ఆసక్తికరంగా లోక్‌సభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి పెద్ద ప్రయత్నాలు జరిగినప్పటికీ, పార్లమెంటరీ కమిటీ నిశ్చితాభిప్రాయం ఏమి టంటే – రెండు దశల్లో ఎన్నికలు జరగాలన్నదే! కొన్ని రాష్ట్రాలకు లోక్‌సభ పదవీకాలం మధ్య లోనూ, మరి కొన్నింటికి లోక్‌సభతోపాటు ఎన్ని కలు జరపాల్సి ఉంటుంది.
సమాఖ్య, ప్రాదేశిక ఎన్నికలను వేరు చేయడం వల్ల ఓటర్లు తమ రాష్ట్రం లేదా ప్రావిన్స్లో ఉన్న నాయకులు లేదా జాతీయ ఎన్నికల సమస్యల కారణంగా ఇటూ అటూ అవగల సంభావ్యతకు గురికాకుండా ఉంటారని నమ్మకం. పోరులో ఉన్న ప్రాంతీయ పార్టీలకు (లేదా పార్టీలకు) ప్రత్యేక గుర్తింపు లేనప్పుడు అలాగే ఓటర్లు సులభంగా గుర్తించగలిగేలా పార్లమెంటరీ, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య తేడాను సూచించే కారణం లేనప్పుడు ఇది జరిగే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఏది ఏమైనప్పటికీ, పదేపదే జరిగే ఎన్నికల ద్వారా అనవసరంగా సమయం, డబ్బులు ఖర్చు చేయకూడదనే ఆలోచన ఆమోదయోగ్యమైనదే. జర్మనీలో ఇటీవల నేపాల్ అనుభవాల నుండి, ఎక్కువ రాజకీయ సుస్థిరతను అందించే రాజ్యాంగపరమైన నిబంధనలు సాధ్యమయ్యే అవకాశం కనిపించింది. ఉదాహరణకు, జర్మన్ బేసిక్ లా, 2015 నేపాలీ రాజ్యాంగం అవిశ్వాసంలో సాను కూల ఓట్లను మాత్రమే అనుమతిస్తాయి. అటువంటి తీర్మానంతో పాటు తదుపరి నాయకుడి పేరు కూడా ఉండాలి.
బ్రిటన్ లో, కెనడాలో కూడా పార్లమెంటు నిబంధనలను పరిష్కరించే ప్రయత్నాలు... కామన్వెల్త్ సంప్రదాయం ద్వారా సభను రద్దు చేసి, తాజా తీర్పును కోరే హక్కును ప్రధానమంత్రి కలిగి ఉండటం ద్వారా విఫలమయ్యాయి. నేపాల్‌లో అదే సంప్రదాయాన్ని అమలు చేయాలని కోరినప్పుడు, దానిని సుప్రీంకోర్టు 2021లో రెండు సందర్భాల్లో అనుమతించకపోగా, కొత్త నాయకుడిని ఎన్నుకో మని సభను కోరింది. మధ్యంతర ఎన్నికలపై ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా 2017లో ఎన్ని కైన సభ పూర్తి ఐదేళ్ల కాల వ్యవధిలో పాలన సాగించేలా అది దోహదపడింది.
మంజీవ్ సింగ్ పురి
వ్యాసకర్త భారత మాజీ రాయబారి
Comments
Please login to add a commentAdd a comment