ఢిల్లీ: జమిలి ఎన్నికలకు మరో ముందడుగు పడింది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుత ప్రభుత్వ పాలనా కాలంలోనే జమిలి(ఒకేసారి దేశవ్యాప్త) ఎన్నికలు నిర్వహిస్తామని నిన్ననే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది. కాగా, వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ను వ్యతిరేకిస్తున్నామని.. పార్లమెంట్‌లో బిల్లు పెడితే ఓడిస్తామంటూ కాంగ్రెస్ చెబుతోంది. గత నెల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో జమిలి ఎన్నికలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: ఈ టర్మ్‌లోనే జమిలి ఎన్నికలు
దేశవ్యాప్తంగా ఏడాది ఏవో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని, వీటి ప్రభావం దేశ అభివృద్ధిపై పడుతుందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి జమిలి ఎన్నికలే పరిష్కారమని తేల్చి చెబూతూ.. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలోనూ ‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’ అంశం ఉన్నందున మళ్లీ మూడోసారి మోదీ సారధ్యంలో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం వంద రోజులు పూర్తిచేసుకున్న తరుణంలో జమిలి ఎన్నికల దిశగా అడుగులు పడ్డాయి.
దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు, లోక్ సభకు ఏక కాలంలో ఎన్నికలు జరపాలన మొదటి నుంచీ జమిలి ఎన్నికల నిర్వహణపై పట్టుదలగా ఉన్న ప్రధాని మోదీ ఈ అంశంపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతిరామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే దిశగా కమిటీ పనిచేసింది. ప్రజల నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానించింది. స్పందన కూడా విశేషంగా వచ్చింది. వేల సంఖ్యలో ఈ-మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. పూర్తి సాధ్యాసాధ్యాలను అధ్యయనంర చేసిన రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇటీవలే కేంద్రానికి నివేదికను సమర్పించింది.
Comments
Please login to add a commentAdd a comment