ప్రధాని నేతృత్వంలో అఖిల పక్ష భేటీలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్ తదితరులు
సాక్షి, న్యూఢిల్లీ : జమిలి ఎన్నికలను తాము సమర్ధిస్తామని ఒడిసా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ తేల్చిచెప్పారు. ఒక దేశం..ఒకే ఎన్నికలు అనే నినాదానికి తమ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఏకకాల ఎన్నికలు సహా పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాగా ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, జేడీయూకు చెందిన నితీష్ కుమార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్ధుల్లా, పీడీపీ చీఫ్ మెహబుబా ముఫ్తీ, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ తదితరులు హాజరయ్యారు. జమిలి ఎన్నికలతో పాటు, 2022లో దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు, మహాత్మ గాంధీ 150వ జయంతోత్సవాల నిర్వహణ సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment