విశాఖపట్నం: రాష్ట్రంలో జమీలి ఎన్నికలు జరగాల్సి వస్తే వైఎస్సార్‌సీపీకి అభ్యంతరం లేదని.. తుది నిర్ణయం మాత్రం సీఎం జగన్‌దేనని స్పష్టం చేశారాయన. విశాఖ ఎండాడలో ఇవాళ వైఎస్సార్‌సీపీ నూతన కార్యాలయాన్ని అమర్నాథ్ ప్రారంభించారు.
వైఎస్సార్‌సీపీ నూతన కార్యాలయం ప్రారంభించి మంత్రి అమర్నాథ్ మాట్లాడారు. ‘‘అసెంబ్లీకి ఆరేడు నెలల సమయం ఉంది. ఒకవేళ జమిలీ వల్ల రెండు మూడు నెలలు ముందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీకి అభ్యంతరం లేదు. జమీలి ఎన్నికలపై పార్టీలో చర్చించి సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకుంటారు’’ అని తెలిపారాయన.
ఇక.. ఏపీలో 26 జిల్లాల్లో 26 పార్టీ కార్యాలయాలు నిర్మించాలని సీఎం జగన్ సంకల్పించారు. అందుకు తగ్గట్లు మొదటి కార్యాలయం విశాఖలో ప్రారంభించాం. అవసరాన్ని బట్టి ఈ వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని సెంట్రల్ పార్టీ కార్యాలయంగా(విశాఖ పాలన రాజధాని నేపథ్యంలో..) కూడా ఉపయోగిస్తాం అని తెలిపారాయన. ఈ కార్యక్రమంలో.. కోలా గురువులు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ వంశీ, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, పసుపులేటి బాలరాజు, కేకే రాజు, ఎంపీ ఎంవీవీ, మేయర్ హరి వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment