సీఎం చంద్రబాబు ఇష్టాగోష్టి
సాక్షి, అమరావతి/గుడ్లవల్లేరు: దేశవ్యాప్తంగా జమిలి అమల్లోకి వచి్చనా ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వచి్చన ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఒక దేశం– ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని చెప్పారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ మాత్రం తమ పబ్బం గడుపుకోవడానికి ఏదిపడితే అది మాట్లాడుతోందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారన్నారు.
స్వర్ణాంధ్ర–విజన్ 2047 డాక్యుమెంట్ ఒక రోజు పెట్టి వదిలేసేది కాదని, దానిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలతోపాటు ప్రతిచోటా చర్చ జరగాలన్నారు. విజన్–2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలన్నారు. 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందన్నారు. సాగునీటి సంఘాలు, సహకార, ఇతర అన్ని రకాల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఈసారి కలెక్టర్ల సదస్సులో ఎన్నో మార్పులు తీసుకొస్తామని, సుదీర్ఘ సమీక్షలకు తావులేకుండా ప్రశ్న–సమాధానాల రూపంలో నిర్వహిస్తామని చెప్పారు. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చకు సంబంధించిన అంశాలు పంపి సమాధానాలు కోరుతామని తెలిపారు. ఆస్పత్రిలో చేరిన బీజేపీ నేత అద్వానీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. కాగా, మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ సభ్యత్వ నమోదుపై ఆయన సమీక్ష నిర్వహించారు. టీడీపీ సభ్యత్వం 73 లక్షలకు చేరుకుంటుందని చెప్పారు.
డోకిపర్రు వేంకటేశ్వరుని సన్నిధిలో సీఎం
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు శ్రీ భూసమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవస్థాన బ్రహ్మోత్సవాలకు శనివారం సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఆయనకు మంగళ వాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(మెయిల్) అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వెంకటకృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతులు స్వాగతం పలికారు.
అంతరాలయంలో ఆయన పేరిట వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత స్వామివార్లకు బాబు పట్టు వస్త్రాలను సమరి్పంచారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment