రాహుల్ పర్యటన ఏర్పాట్లలో నేతలు బిజీ బిజీ | Congress leaders to busy about Rahul gandhi tour | Sakshi
Sakshi News home page

రాహుల్ పర్యటన ఏర్పాట్లలో నేతలు బిజీ బిజీ

Published Tue, May 12 2015 11:45 PM | Last Updated on Sat, Aug 11 2018 7:11 PM

Congress leaders to busy about Rahul gandhi tour

రంగారెడ్డి : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన ఏర్పాట్లలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈనెల 14 సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ర్యాలీగా వెళుతుండడంతో కాంగ్రెస్ నేతలంతా ఎయిర్‌పోర్టులో వివిధ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఎయిర్‌పోర్టులోని హజ్ టెర్మినల్‌లో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు.

రాహుల్‌గాంధీ స్వాగతం పలికేందుకు, మీడియాతో మాట్లాడేందుకు ఇప్పటివరకు నిర్ణయించిన స్థలాల్లో ఎస్‌పీజీ అధికారులు మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. మంగళవారం ఎయిర్‌పోర్టులో మాజీ మంత్రులు సబితారెడ్డి, డీకె.అరుణతోపాటు మల్లు రవి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
(శంషాబాద్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement