'చంద్ర దండు' సభ్యుల అరెస్ట్ | chandra dandu members arrested in ananthpuram | Sakshi
Sakshi News home page

'చంద్ర దండు' సభ్యుల అరెస్ట్

Published Fri, Jul 24 2015 9:00 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

chandra dandu members arrested in ananthpuram

హిందూపురం (అనంతపురం): ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అడ్డుకునేందుకు వచ్చిన చంద్రదండు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, రాహుల్‌గాంధీని అడ్డుకునేందుకు చంద్రదండు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో మొత్తం 20 మంది చిలమత్తూరు చెక్‌పోస్ట్ వద్దకు తరలి వచ్చారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

రాహుల్ గాంధీ పర్యటన శుక్రవారం ఉదయం బెంగళూరు నుంచి సరిహద్దు ప్రాంతమైన కొడికొండ చేరుకున్నారు. ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితర నేతలు ఆయనకు స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ ఓబుల దేవర చెరువుకు చేరుకుని పాదయాత్ర ప్రారంభిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement