
అమేథీతో రాహుల్‌తో మాట్లాడుతున్న స్థానికుడు
అమేథీ/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తాను ఓడిపోయినా, నియోజకవర్గాన్ని విడిచిపెట్టనని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు. అమేథీ నుంచి ఓటమి పాలైన తర్వాత బుధవారం తొలిసారి అక్కడ పర్యటించారు. జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలు, బూత్ అధ్యక్షులతో ఆయన సమాశమయ్యారు. అమేథీలో తాను ఓడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులే కారణమని, వారు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్లే తాను ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అదే సమయంలో అమేథీలో తన విజయం కోసం శ్రమించిన పార్టీ శ్రేణులకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు.
కోటికి చేరిన రాహుల్ ట్విట్టర్ ఫాలోవర్స్
రాహుల్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య ఒక కోటికి చేరింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఫాలోవర్స్‌కు బుధవారం ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అలాగే అమేథీలో జరిగే కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులతో జరిగే సమావేశంలో దీనిని సెలబ్రేట్ చేసుకుందామని పేర్కొన్నారు.