t congress MLC
-
ఆత్మహత్యల్లో తెలంగాణ ప్రధమ స్థానం
హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ శాసన మండలి మంగళవారం అట్టుడికిపోయింది. ప్రారంభమైన తొలి రోజు రైతు ఆత్మహత్యలపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ సభా పక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ...దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని స్పష్టం చేశారు.మిగత విషయాల్లో మాత్రం రాష్ట్రం చివరి స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై లెజిస్లేచర్ కమిటీ వేయాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి అడ్డుతగిలారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలే అయిందని నాయిని వ్యాఖ్యానించారు. నాయిని వ్యాఖ్యలపై షబ్బీర్ అలీ మండిపడ్డారు. 16 నెలల్లో ఏం చేయలేకపోతే ఇంకెందుకు పాలిస్తున్నారంటూ నాయినిపై షబ్బీర్ అలీ ఎదురు దాడికి దిగారు. అంతలో శాసనమండలి ఛైర్మన్ జోక్యం చేసుకుని టీఆర్ఎస్ సభ్యులను సముదాయించారు. -
'ఆ ఘనత కేసీఆర్‌దే'
హైదరాబాద్ : హైదరాబాద్ నగరాన్ని చెత్త సిటీగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో షబ్బీర్ అలీ మాట్లాడుతూ... పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది సమస్యలను పరిష్కరించడంతో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. సమ్మె దిగిన సదరు కార్మికుల డిమాండ్లు సమంజసమైనవే అని షబ్బీర్ అలీ అభిప్రాయపడ్డారు. సమ్మెను పరిష్కరించకుంటే రేపటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలే చెత్తను తొలగిస్తారన్నారు. హైదరాబాద్ నగరంలో పేరుకుపోయిన చెత్తపై స్పందించాలని గవర్నర్ నరసింహన్‌కు షబ్బీర్ అలీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
'రేవంత్ చర్యలకు చంద్రబాబే బాధ్యుడు'
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో టీడీపీ ఉపనేత రేవంత్‌రెడ్డి అరెస్ట్‌పై శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మంగళవారం హైదరాబాద్‌లో స్పందించారు. ఓటు నోటు వ్యవహారంలో రేవంత్‌రెడ్డి చర్యలను షబ్బీర్ అలీ ఖండించారు. రేవంత్ చర్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబే బాధ్యుడని ఆయన ఆరోపించారు. మహానాడులో రాజకీయ నీతులు చెప్పిన చంద్రబాబు ఆ మర్నాడే ఎమ్మెల్యే కొనుగోలుకు రేవంత్‌ను పంపారని విమర్శించారు. రేవంత్ దొరికాడు కాబట్టి దొంగ అయ్యారన్నారు. ఫాం హౌజ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇలాంటి చర్యలకే పాల్పడుతున్నారని అనిపిస్తోందని తెలిపారు. డబ్బు, అధికార అహంకారంతో ప్రజా ప్రతినిధులను తప్పు దారి పట్టిస్తున్నారని కేసీఆర్‌పై షబ్బీర్ అలీ మండిపడ్డారు. వీహెచ్ స్పందన : రేవంత్ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ వ్యవహారం రాజకీయ ప్రలోభాలు, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. -
'సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేని కేసీఆర్'
-
'సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేని కేసీఆర్'
హైదరాబాద్: టీడీపీ జాతీయ పార్టీ అని చంద్రబాబు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడినని సొంతడబ్బా కొట్టుకుంటున్నారని తెలంగాణ శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. టీడీపీ ఎప్పటికీ జాతీయ పార్టీ కాలేదని ఆయన తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.... చంద్రబాబుకి వెన్నుపోటుదారుడనే ముద్ర ఉంది తప్పా జాతీయ నేత అన్న గుర్తింపు లేదని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఓ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ మరో రాష్ట్రంలో బలంగా ఉన్న దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని ఆయన వెల్లడించారు. 2019లోగా తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతందని షబ్బీర్ అలీ జోస్యం చెప్పారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీని వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడించి గోదావరిలో కలిపేస్తారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. కేసీఆర్ కి సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం పోయినట్లుందని ఆరోపించారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించి టీఆర్ఎస్ లో కలుపుకున్నారని విమర్శించారు. వారితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్తే తెలంగాణలో ఉండే పార్టీలు ఏవో తెలుస్తుందని షబ్బీర్ అలీ చెప్పారు. -
'మెడికల్ సీట్లు విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీ సీట్లను విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో పొంగులేటి సుధాకర్‌రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.... ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ సర్కార్ చోద్యం చూస్తోందని విమర్శించారు. మెడికల్ బి కేటగిరి సీట్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష ఉందని సదరు శాఖ మంత్రికి తెలియకపోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. సీట్ల అమ్మకంపై తెరవెనుక ఏదో బాగోతం జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ పెద్దలు ఈ వ్యవహారంలో కుమ్మక్కాయారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎంబీబీఎస్ అడ్మిషన్లపై నియంత్రణ ఉండాలని... ప్రభుత్వమే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని పొంగులేటి సుధాకర్‌రెడ్డి కేసీఆర్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. -
'సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద పేదలకు ఇళ్లు నిర్మించాలి'
హైదరాబాద్: పేదల ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. ఆయనకు చిత్తశుద్దే ఉంటే తన క్యాంప్ ఆఫీసు పక్కనే ఉన్న ఐఏఎస్ అసోసియేషన్ భూముల్లో నిర్మించాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌లో షబ్బీర్ అలీ విలేకర్లతో మాట్లాడుతూ... నాలాలు కబ్జాకు గురయ్యాయంటున్న కేసీఆర్... మరి తెలంగాణ భవన్‌ను నాలాల్లోనే నిర్మించారన్న సంగతి గ్రహించాలన్నారు. తెలంగాణ భవన్ కోసం కబ్జా చేసిన 170 గజాల భూమిని పేదల ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లను నిర్మించి కేసీఆర్ చిత్తశుద్ధి చాటుకుంటే మరిన్నీ ఇళ్లు నిర్మించేందుకు భూములు చూపిస్తామని తెలిపారు. పేదల ఇళ్ల కోసం యూనివర్శిటీ భూములు తీసుకుంటామంటే సహించేది లేదని కేసీఆర్ ప్రభుత్వానికి షబ్బీర్ అలీ హెచ్చరించారు. -
'దమ్ముంటే రాహుల్ పర్యటన అడ్డుకొండి'
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన కంటే తుగ్లక్ పాలనే నయమని శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్‌లో కేసీఆర్ పాలనపై షబ్బీర్ అలీ నిప్పులు చెరిగారు. కేసీఆర్‌కు పాలన గురించే తెలియదని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందన్నారు. దమ్ముంటే రాహుల్ పర్యటన అడ్డుకొండంటూ ఆయన బీజేపీ, టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. కేసీఆర్ 10 నెలల పాలనలో హైకోర్టు నుంచి 11 తీర్పులు వ్యతిరేకంగా వచ్చాయన్న సంగతని షబ్బీర్ అలీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. అందుకే తెలంగాణలో రాహుల్ పర్యటన ఎందుకని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారన్నారు. 11 నెలల మోదీ పాలనలో రైతులకు భరోసా లేకుండా పోయిందని షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. అచ్చేదిన్ మెదీకి, బీజేపీకే అని వ్యంగంగా అన్నారు. -
'కేసీఆర్ ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహారిస్తోంది'
హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహరిస్తోందని టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు. బుధవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో మాట్లాడుతూ... రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ ప్రబలుతుందని 15 రోజుల క్రితమే హెచ్చరించినప్పటికీ కేసీఆర్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని ఆయన విమర్శించారు. స్వైన్ ఫ్లూ మరణాలకు టీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత అని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. తక్షణమే హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలని ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వైన్ ఫ్లూ నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా షబ్బీర్ అలీ సూచించారు. -
'తెలంగాణ సర్కార్ కు సీమాంధ్ర ప్రభుత్వం కిరాయి కట్టాల్సిందే'
హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధాని కాదని, తాత్కాలిక రాజధాని మాత్రమే అని తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ ఆమోస్ స్ఫష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఆమోస్ మాట్లాడుతూ... రాష్ట్రం విడిపోగానే సీమాంధ్ర ప్రజలు వారి ప్రాంతానికి రాజధాని మార్చుకోవాలని ఆయన సూచించారు. సీమాంధ్రకు హైదరాబాద్ తాత్కాలిక రాజధానిగా ఉన్నన్నాళ్లు వారు ఫిరాయిదారులే అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వానికి సీమాంధ్ర ప్రభుత్వం కిరాయి కట్టాల్సిందేనని ఆమోస్ సీమాంధ్రులకు విజ్ఞప్తి చేశారు.