
'తెలంగాణ సర్కార్ కు సీమాంధ్ర ప్రభుత్వం కిరాయి కట్టాల్సిందే'
హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధాని కాదని, తాత్కాలిక రాజధాని మాత్రమే అని తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ ఆమోస్ స్ఫష్టం చేశారు. శనివారం హైదరాబాద్లో ఆమోస్ మాట్లాడుతూ... రాష్ట్రం విడిపోగానే సీమాంధ్ర ప్రజలు వారి ప్రాంతానికి రాజధాని మార్చుకోవాలని ఆయన సూచించారు.
సీమాంధ్రకు హైదరాబాద్ తాత్కాలిక రాజధానిగా ఉన్నన్నాళ్లు వారు ఫిరాయిదారులే అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వానికి సీమాంధ్ర ప్రభుత్వం కిరాయి కట్టాల్సిందేనని ఆమోస్ సీమాంధ్రులకు విజ్ఞప్తి చేశారు.