Amos
-
ప్రేమ వివాహం.. ఆపై ఆటో డ్రైవర్‌కు దగ్గరై.. భర్తను దారుణంగా..
సాక్షి, కర్నూలు: గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన దాడిబండ ఆమోస్ (26) దారుణ హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమోస్ భార్య అరుణ ప్రోద్బలంతో ఆటోడ్రైవర్ ములకల సూర్యప్రదీప్, అతని స్నేహితుడు నేసే జీవన్‌కుమార్‌తో కలసి హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. నిందితులను పక్కా ఆధారాలతో నాల్గవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శంకరయ్యతో కలసి బుధవారం సాయంత్రం డీఎస్పీ కేవీ మహేష్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. డిగ్రీ వరకు చదువుకున్న ఆమోస్ అదే గ్రామానికి చెందిన కుమ్మరి గోపాల్ కుమార్తె అరుణను 2016లో కులాంతర వివాహం చేసుకున్నాడు. అయితే అరుణ మైనర్ అయినందున ఆమెను హోమ్‌లో ఉంచి ఆమోస్‌పైన నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. అరుణ మేజర్ అయిన తర్వాత తిరిగి ఇద్దరూ కలుసుకుని మరోసారి వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగు సంవత్సరాల వయస్సు గల కుమారుడు ఉన్నాడు. చదవండి: (రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్ మృతి) అల్వాల గ్రామంలో ఉన్నప్పుడు మద్యం సేవించి భార్యను అమోస్ శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టేవాడు. ఈ విషయంలో భార్యాభర్తలు గొడవ పడి అల్వాల గ్రామం వదిలి ఏడాది క్రితం కర్నూలుకు వచ్చారు. ఉద్యోగనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటూ సిటీ స్క్వేర్ మాల్లోని బజాజ్ ఎలక్ట్రిక్ షోరూమ్‌లో ఆమోస్ సెక్యూరిటీ గార్డుగా, అదే షోరూమ్‌లో జాకీ దుస్తుల దుకాణంలో అరుణ సేల్స్ గర్ల్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవారు. వీరిద్దరూ సూర్యప్రదీప్ అనే వ్యక్తి ఆటోలో వెళ్లి వస్తుండేవారు. ఆటోడ్రైవర్ సూర్యప్రదీప్‌తో కలసి ఆమోస్ తరచూ మద్యం సేవించేవాడు. ఈ క్రమంలో ఆటోడ్రైవర్‌తో అరుణకు చనువు ఏర్పడి తన బాధలు చెప్పుకుంది. హత్య కేసులో నిందితుల అరెస్ట్ చూపి వివరాలు వెల్లడిస్తున్న కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్ భర్త తనను శారరీకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడని, అతనిని అడ్డు తొలగిస్తే పెళ్లి చేసుకుంటానని సూర్యప్రదీప్‌తో చెప్పుకుంది. దీంతో సూర్యప్రదీప్ పథకం ప్రకారం తన స్నేహితుడైన జీవన్ సహాయంతో ఈనెల 22వ తేదీ రాత్రి శరీన్‌నగర్‌లోని సవారితోట కాలనీ చివర గల హంద్రీ నది ఒడ్డుకు ఆమోస్‌ను తీసుకువెళ్లాడు. మద్యం సేవించిన తర్వాత వెంట తీసుకువెళ్లిన రాడ్డుతో తలపై బాది హత్య చేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి కాల్చినట్లు విచారణలో నిందితులు అంగీకరించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రాడ్డు, బండరాయి, సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. చదవండి: (అయ్యో తల్లి.. ఎంత ఘోరం జరిగిపోయింది) -
చూపున్న పాట...
మిణుగురు సమాజానికి దివిటీలు ఇరవై తొమ్మిదేళ్ల ఆమోసు ను కలిసినప్పుడు అతను దీక్షగా మునివేళ్లతో కీ బోర్డు మీద సుస్వరాలు పలికిస్తూ కనిపించాడు. ఆ స్వరఝరి వెంబడి నేనూ కాసేపు ప్రయాణించాను. అతనితో మాట్లాడుతున్నంతసేపూ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోగలననే నమ్మకం, సాధించగలననే ఆత్మవిశ్వాసం ప్రతి మాటలోనూ కనిపించింది. పట్టుదల, దీక్షతో సహవాసం చేసిన ఇన్నాళ్ల అతని ప్రయాణం వైకల్యాన్ని ఎలా వెనక్కి నెట్టగలిగిందో తెలుసుకున్నాను. చీకటి-వెలుగుల రంగూ రూపు తెలియకపోయినా జీవితాన వెలుగులు నింపుకుంటున్న ఆమోసుతో కాసేపు ముచ్చటిస్తే యువత మదిలో అధైర్యం పుట్టనే పుట్టదు అనిపించింది. హైదరాబాద్ రామకృష్ణాపురంలో ఉంటున్న ఆమోసును కదిపితే తన జీవన ప్రయాణాన్ని ఒక ప్రవాహంలా వినిపించాడు. అమ్మనాన్నలే చూపు... ‘‘నా పూర్తిపేరు ఆమోసు ప్రకాశ్. అమ్మ హైమావతి, నాన్న జయప్రకాశ్. రెండు కళ్లూ లేకుండా పుట్టిన నన్ను చూసి అమ్మానాన్నా చాలా బాధపడ్డారట. ఎలా పెరుగుతానో, ఏమౌతానో అని వారి బెంగ. నా కంటే ముందు పుట్టిన అన్నకు చూపు బాగానే ఉంది. నాకే ఇలా! విధికి తలవంచక తప్పదు. ఇచ్చిన బిడ్డనే కంటికి రెప్పలా సాక్కోవాలి. అలా అమ్మానాన్నలే నాకు చూపయ్యారు. చిన్నప్పటి నుంచి ‘చూపు’ లేదని నా పై చాలామంది జాలిచూపే వారు. అసలు చూపు అంటే ఏంటి?! ఇదో పెద్ద సందేహం నాకు. అయినా దాని గురించి ఏనాడూ చింత లేదు. సంగీతం అంటే పిచ్చి. ఎక్కడ పాటలు విన్నా అక్కడే ఆగిపోయేవాడిని. చేతికి అందిన వస్తువులను తడుతూ, ఆ శబ్దాలలో గమకాలను వింటూ ఆనందించేవాణ్ణి. అది చూసి అమ్మానాన్నా చిన్న చిన్న సంగీత వాద్యపరికరాలు కొనిచ్చేవారు. అవే నాకు నేస్తాలయ్యాయి. కాస్త పెద్దయ్యాక అంధుల పాఠశాలలో చేర్చారు. నా పనులు నేనే చేసుకోవడం, చదువుకోవడంతో అమ్మకు కాస్త బాధ తగ్గించినవాడినయ్యాను. నాన్న అయితే, ‘నీకు ఏది ఇష్టమో దానిపైనే పూర్తి శ్రద్ధ పెట్టు’ అని వెన్నుతట్టారు. ఆ మాటలు నాకు ఎక్కడలేని ధైర్యాన్నిచ్చాయి. అలా చదువుకుంటూనే, లైట్ మ్యూజిక్‌నీ వొంటపట్టించుకున్నాను. నా ఆలోచన ఒకటే ఎవరి మీదా ఆధారపడకూడదు. నేనుగా ఎదుగుతూనే నాలాంటి వారికి చేయూతనివ్వాలి. రేయింబవళ్లూ సాధన... పాఠశాల స్థాయిలోనే కీ బోర్డ్ నేర్చుకున్నాను. అసలు ఆ పరికరం ఎలా ఉంటుందో తెలియదు. ఏ మీట నొక్కితే ఏ రాగం వస్తుందో తెలియదు. సాధన.. రేయింబవళ్లూ సాధన. తెలియని రాగాలను వేళ్లతోనే తెలుసుకున్నాను. ఏ మీట నొక్కితే ఏ రాగం వస్తుందో మనసులో ముద్రవేసుకున్నాను. అలా సాధనలో ఉండగానే మా స్కూల్‌కి ఒకసారి సంగీతదర్శకులు రామాచారి గారు వచ్చి ‘త్రివేణి సంగమం’ అనే సంగీత కార్యక్రమం చేస్తున్నాం. అందులో మీ పాఠశాల నుంచి ప్రావీణ్యం గలవారు కావాలన్నారు. ఆ విధంగా శిల్పకళా వేదికలో మా స్నేహితులతో కలిసి ప్రముఖుల ముందు ప్రోగ్రామ్ చేశాను. ఆ ప్రశంసలు నన్ను మరింతగా కృషి చేసేందుకు తోడ్పడ్డాయి. మ్యూజిక్ కంపోజింగ్... కీ బోర్డ్‌తో పాటు ఫ్లూట్, రిథమ్ప్యాడ్, శాక్స్ఫోన్, తబలా, జాజ్, ఢోలక్, కాంగో.. ఇలా తొమ్మిది వాద్యపరికరాలను మంద్రస్థాయిలో మోగించే నైపుణ్యాన్ని అలవరచుకున్నాను. గాత్రంలో శభాష్ అనిపించుకున్నాను. ఇందుకోసం కొన్నేళ్లు పట్టింది. అయినా వదల్లేదు. విజువల్లీ చాలెంజ్డ్ వ్యక్తులైన మాధవి అక్క, సురేంద్ర, ఏసుబాబు, నరేశ్, విక్టర్, రవీంద్ర..లను కలిశాను. వారూ సంగీతాభిలాష కలవారే! మేమంతా కలిసి ‘యువతరమా మేలుకో... ’ అనే కాన్సెప్ట్‌తో ‘లీడ్ ఇండియా 2020’ అనే ఆల్బమ్‌ని తయారుచేశాం. ఆ ఆల్బమ్‌కి నేనే సంగీత సారథ్యం వహించాను. అలాగే ‘శ్రీ బాబా మనసా స్మరామి’ అనే భక్తి మాలికలోని ఆరు పాటలకు మ్యూజిక్ కంపోజ్ చేశాను. సంగీత దర్శకత్వం కల... డిగ్రీ పూర్తయింది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. సంగీత దర్శకుడిగా ఎదగాలనేది నా కల. ఇప్పటికే వేదికల మీద ఎన్నో ప్రదర్శనలు ఇస్తున్న మా స్నేహ బృందంతో ఆ కల నెరవేర్చుకోవాలని కృషి చేస్తున్నాను. భుక్తి కోసం నా ఆదాయాన్ని నేను సంపాదించుకుంటున్నాను. నేను పుట్టినప్పుడు కళ్లు లేని నన్ను చూసి నా తల్లిదండ్రులు ఎంతగానో బాధపడ్డారట. ఇప్పుడు నన్ను చూసి చాలా సంతోషపడుతుంటారు’’ అని తెలిపాడు ఆమోసు. వీరి చూపుకు కొన్ని రంగులు, ఇంకొందరి హంగులు.. తెలియకపోవచ్చు. కానీ, ఈ సమాజంలో ఎదగగలమనే నిండైన ఆత్మవిశ్వాసం మాత్రం గుండెల నిండా ఉంది. ఆమోస్ లాంటివారికి కావల్సింది జాలి కాదు, కాస్త సహకారం... మరికాస్త ప్రోత్సాహం. సమాజం నుంచి ఈ రెండూ అందే బాధ్యతను మనమంతా తీసుకుందాం. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి పాఠకులకు గమనిక పేరుకు ఇది ‘మిణుగురులు’ శీర్షికే అయినా, ఇందులో వచ్చే వ్యక్తుల ఆదర్శవంతమైన జీవితాలు సమాజానికి దివిటీల వంటివి. చీకటిని తిడుతూ కూర్చోక, అమోస్లా చిరుదివ్వెలు వెలిగించుకున్న వారెవరైనా మీకు తారసపడితే వారి వివరాలు మాకు తెలియజేయండి. అంధులలో స్ఫూర్తి నింపడానికి మీ వంతు కర్తవ్యంగా ముందుకు రండి. మా చిరునామా మిణుగురులు, ఫ్యామిలీ, సాక్షి దినపత్రిక, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34. -
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
డీఎంహెచ్ఓ ఆమోస్ మిర్యాలగూడ క్రైం : స్కానింగ్ కేంద్రాల్లో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఆమోస్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఐఎంఏ భవనంలో స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు, గైనకాలజీ డాక్టర్లకు గర్భస్త పిండ లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భస్త పిండానికి సంబంధించిన వ్యా ధులను కనుగొనడానికి మాత్రమే స్కానింగ్ నిర్వహించాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఆడ, మగ అని వివరాలు తెలపకూడదని అన్నారు. స్కానింగ్ సెంటర్లలో నిర్వహించే పరీక్షల వివరాలను ప్రతి నెల క్లస్టర్ కార్యాలయంలో అం దించాలని ఆదేశించారు. లింగనిర్ధారణ పరీ క్షలు చేసి అబార్శన్లు నిర్వహించినట్లు తెలిస్తే సంబంధిత డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. సమాజంలో రోజురోజుకు ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్ల అనే వివక్షను ప్రతి ఒక్కరూ విడనాడాలని సూచించారు. సమావేశంలో మాస్ మీడియా అధికారి తిరుపత య్య, లీగల్ అడ్వయిజర్ వెంకట్‌రెడ్డి, ఎస్పీహెచ్ఓ కృష్ణకుమారి, ఐఎంఏ అధ్యక్షుడు కృష్ణప్రసాద్, డాక్టర్లు జ్యోతి, పారిజాత, శ్వేతారెడ్డి, క్లస్లర్ అధికారులు శ్రీనివాసస్వామి, శ్రీనివాసరావు, భగవాన్‌నాయక్, తిరుపతయ్య పాల్గొన్నారు. -
'కాంగ్రెస్ ఓటమికి పొన్నాల రాజీనామా చేయాలి'
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయాలని ఆపార్టీ సీనియర్ నేత ఆమోస్ పరోక్షంగా డిమాండ్ చేశారు. పార్టీ బలోపేతానికి కొత్త పీసీసీని పునర్వస్థీకరించాలని ఆయన సూచించారు. కాగా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆమోసు తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్ష పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పొన్నాల లక్ష్మయ్యకు పంపారు. -
'బాబు సబ్ జూనియర్ నేతగా మాట్లాడుతున్నాడు'
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి చిదంబరాన్ని ఎందుకు కలిశారో చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆమోస్, యాదవరెడ్డి డిమాండ్ చేశారు. సమన్యాయం అంటున్న చంద్రబాబు ఏం చేయాలో కూడా చెప్పాలన్నారు. ప్రధానమంత్రి హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని వారు శనివారమిక్కడ పేర్కొన్నారు. టీడీపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారని ఆమోస్, యాదవరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సబ్ జూనియర్ నేతగా మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. తెలంగాణ బిల్లుపై ఓటింగే అవసరం లేనప్పుడు ఎమ్మెల్యేలను కొనే అవసరం ఎవరికుందని సూటిగా ప్రశ్నించారు. -
'సీమాంద్రులు కిరాయిదారులే అవుతారు'
-
'తెలంగాణ సర్కార్ కు సీమాంధ్ర ప్రభుత్వం కిరాయి కట్టాల్సిందే'
హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధాని కాదని, తాత్కాలిక రాజధాని మాత్రమే అని తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ ఆమోస్ స్ఫష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఆమోస్ మాట్లాడుతూ... రాష్ట్రం విడిపోగానే సీమాంధ్ర ప్రజలు వారి ప్రాంతానికి రాజధాని మార్చుకోవాలని ఆయన సూచించారు. సీమాంధ్రకు హైదరాబాద్ తాత్కాలిక రాజధానిగా ఉన్నన్నాళ్లు వారు ఫిరాయిదారులే అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వానికి సీమాంధ్ర ప్రభుత్వం కిరాయి కట్టాల్సిందేనని ఆమోస్ సీమాంధ్రులకు విజ్ఞప్తి చేశారు. -
హైదరాబాద్‌పై పెత్తనంలేని తెలంగాణ మాకెందుకు?
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌లోని శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతలను గవర్నర్‌కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్సీ కె.ఆర్.ఆమోస్ తప్పుపట్టారు. హైదరాబాద్‌పై అధికారాల్లేకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఉపయోగమేముందని ప్రశ్నించారు. సీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర పెద్దల తీరు చూస్తుంటే రాష్ట్రం విభజించిన తరువాత హైదరాబాద్‌లో ఇల్లు నిర్మించాలన్నా....మరే చిన్న అనుమతి అవసరమైనా గవర్నర్ వద్దకు వెళ్లమని చెబుతున్నట్లుగా ఉందని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత కూడా సీమాంధ్ర ఉద్యోగులంతా ఇక్కడే కొనసాగడమంటే60 ఏళ్లుగా చేస్తున్న తెలంగాణ ఉద్యమానికి ఫలితం లేకుండా చేయడమేనని మండిపడ్డారు. అధికారాలు లేని తెలంగాణ తమకేమీ వద్దని, పనికిరాని ప్రతిపాదనలతో చెలగాటమాడితే తెలంగాణ ప్రజలు మళ్లీ ఉద్యమిస్తారని హెచ్చరించారు. పుట్టగతుల్లేని సీమాంధ్ర నేతలకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇవ్వడంవల్లే ఎమ్మెల్యేలు, మంత్రులుగా కొనసాగుతున్నారని, అలాంటి నేతలు రాష్ట్రాన్ని విభజిస్తే పార్టీకి పుట్టగతులుండవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. -
'రాష్ట్రం విడిపోతున్నందున గాంధీభవన్ ఇక టి.కాంగ్రెస్ దే'
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనివార్యమైన నేపథ్యంలో ఇక గాంధీభవన్ తెలంగాణ కాంగ్రెస్ దేనని కేఆర్. ఆమోస్ తెలిపారు. తెలంగాణ పీసీసీ కావాలని చాలాకాలం నుంచి కోరుతున్నామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్ వల్లే వస్తుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లే ఆవశ్యకత చాలా ఉందన్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేక తెలంగాణ పీసీసీ కావాలని కాంగ్రెస్ అధిష్టానానికి విన్నవించామన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందన్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గుంటూరు- ప్రకాశం మధ్య వేయి ఎకరాలు ఎందుకు కొన్నారని ఆమోస్ గతంలో స్రశ్నించిన సంగతి తెలిసిందే.