'రాష్ట్రం విడిపోతున్నందున గాంధీభవన్ ఇక టి.కాంగ్రెస్ దే' | gandhi bhavan will be hand over to telangana congress:amos | Sakshi
Sakshi News home page

'రాష్ట్రం విడిపోతున్నందున గాంధీభవన్ ఇక టి.కాంగ్రెస్ దే'

Published Sun, Oct 20 2013 3:44 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'రాష్ట్రం విడిపోతున్నందున గాంధీభవన్ ఇక టి.కాంగ్రెస్ దే' - Sakshi

'రాష్ట్రం విడిపోతున్నందున గాంధీభవన్ ఇక టి.కాంగ్రెస్ దే'

హైదరాబాద్: రాష్ట్ర విభజన అనివార్యమైన నేపథ్యంలో ఇక గాంధీభవన్ తెలంగాణ కాంగ్రెస్ దేనని కేఆర్. ఆమోస్ తెలిపారు. తెలంగాణ పీసీసీ కావాలని చాలాకాలం నుంచి కోరుతున్నామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్ వల్లే వస్తుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లే ఆవశ్యకత చాలా ఉందన్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేక తెలంగాణ పీసీసీ కావాలని కాంగ్రెస్ అధిష్టానానికి విన్నవించామన్నారు.

 

 రాష్ట్రం సమైక్యంగా ఉంటుందన్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గుంటూరు- ప్రకాశం మధ్య వేయి ఎకరాలు ఎందుకు కొన్నారని ఆమోస్ గతంలో స్రశ్నించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement