ఆత్మహత్యల్లో తెలంగాణ ప్రధమ స్థానం
హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ శాసన మండలి మంగళవారం అట్టుడికిపోయింది. ప్రారంభమైన తొలి రోజు రైతు
ఆత్మహత్యలపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ సభా పక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ...దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని స్పష్టం చేశారు.మిగత విషయాల్లో మాత్రం రాష్ట్రం చివరి స్థానంలో నిలిచిందన్నారు.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై లెజిస్లేచర్ కమిటీ వేయాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి అడ్డుతగిలారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలే అయిందని నాయిని వ్యాఖ్యానించారు. నాయిని వ్యాఖ్యలపై షబ్బీర్ అలీ మండిపడ్డారు. 16 నెలల్లో ఏం చేయలేకపోతే ఇంకెందుకు పాలిస్తున్నారంటూ నాయినిపై షబ్బీర్ అలీ ఎదురు దాడికి దిగారు. అంతలో శాసనమండలి ఛైర్మన్ జోక్యం చేసుకుని టీఆర్ఎస్ సభ్యులను సముదాయించారు.