చర్చిస్తామని చెప్పి పారిపోయారు: షబ్బీర్
హైదరాబాద్: రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభంపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఏమీ మాట్లాడకుండానే పారిపోయిందని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ నిర్వహించకుంటే పదవులు పోతాయనే భయంతోనే సమావేశాలు నిర్వహించారని ఆరోపించారు.
ప్రతిపక్షాలు లేకుండా సభను నడపడం, శాసనసభను ఏడాదికి కేవలం 23 రోజులే నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపహాస్యం చేస్తున్నారని షబ్బీర్ అలీ విమర్శించారు.