మాచారెడ్డి (నిజామాబాద్): రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుదే బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ శాసనమండలి నేత షబ్బీర్ అలీ అన్నారు. ఆయన శనివారం మండలం కేంద్రంలో గ్రామీణ క్రీడల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.
సదాశివనగర్ మండలానికి చెందిన రైతు రాష్ట్ర రాజధానిలో బలవన్మరణం చెందితే తప్పుడు నివేదికలతో వక్రీకరణలకు ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. అలాగే కాంగ్రెస్ హయాంలో దివంగత సీఎం వైఎస్సార్ రైతులకు అండగా నిలిచారని షబ్బీర్ అలీ గుర్తు చేశారు.
'రైతు ఆత్మహత్యలకు కేసీఆర్‌దే బాధ్యత'
Published Sat, Sep 26 2015 6:22 PM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM
Advertisement
Advertisement