రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ
Published Mon, Nov 30 2015 1:15 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. అయితే విచారణకు ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాదులు హాజరు కాకపోవడంతో న్యాయస్ధానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ అగ్రికల్చర్ చీఫ్ సెక్రటరీ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఆత్మహత్యలపై విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది.
Advertisement
Advertisement