'రేవంత్ చర్యలకు చంద్రబాబే బాధ్యుడు'
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో టీడీపీ ఉపనేత రేవంత్రెడ్డి అరెస్ట్పై శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మంగళవారం హైదరాబాద్లో స్పందించారు. ఓటు నోటు వ్యవహారంలో రేవంత్రెడ్డి చర్యలను షబ్బీర్ అలీ ఖండించారు. రేవంత్ చర్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబే బాధ్యుడని ఆయన ఆరోపించారు.
మహానాడులో రాజకీయ నీతులు చెప్పిన చంద్రబాబు ఆ మర్నాడే ఎమ్మెల్యే కొనుగోలుకు రేవంత్ను పంపారని విమర్శించారు. రేవంత్ దొరికాడు కాబట్టి దొంగ అయ్యారన్నారు. ఫాం హౌజ్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇలాంటి చర్యలకే పాల్పడుతున్నారని అనిపిస్తోందని తెలిపారు. డబ్బు, అధికార అహంకారంతో ప్రజా ప్రతినిధులను తప్పు దారి పట్టిస్తున్నారని కేసీఆర్పై షబ్బీర్ అలీ మండిపడ్డారు.
వీహెచ్ స్పందన :
రేవంత్ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ వ్యవహారం రాజకీయ ప్రలోభాలు, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వి.హనుమంతరావు డిమాండ్ చేశారు.