అమేథీ బరిలో 'రాబర్ట్ వాద్రా'? | Robert Vadra Hints At Contesting Lok Sabha Elections | Sakshi
Sakshi News home page

అమేథీ బరిలో 'రాబర్ట్ వాద్రా'?

Apr 4 2024 8:21 PM | Updated on Apr 4 2024 9:01 PM

Robert Vadra Hints At Contesting Lok Sabha Elections - Sakshi

కాంగ్రెస్ అగ్ర నేత 'రాహుల్ గాంధీ' అమేథీ నుంచి పోటీ చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. అయితే ఈయన వయనాడ్ నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేయడానికి నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రశ్నార్థకంగా మారిన అమేథీ నుంచి ప్రియాంక గాంధీ భర్త 'రాబర్ట్ వాద్రా' పోటీ చేయనున్నట్లు సమాచారం.

అమేథీ ప్రజలు నేను ఎంపీ కావాలని నిర్ణయించుకుంటే.. తప్పకుండా ప్రాతినిధ్యం వహిస్తానని రాబర్ట్ వాద్రా ప్రకటించారు. ప్రస్తుత ఎంపీ 'స్మృతీ ఇరానీ' ప్రజలకు ఏమీ చేయలేదని, వారందరూ నిరాశ చెందుతున్నారని అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీని నిందించడానికి మాత్రమే ఆమె ఉన్నారని పేర్కొన్నారు.

స్మృతీ ఇరానీని గెలిపించి తప్పు చేశామని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు భావిస్తున్నట్లు వాద్రా పేర్కొన్నారు. అమేథీ నుంచి బరిలోకి దిగి.. ప్రజల అభివృద్ధికి దోహదపడతానని ఆయన అన్నారు.

రాజకీయ రంగప్రవేశం గురించి వాద్రా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. ఏప్రిల్ 2022లో కూడా ప్రజలు కోరుకుంటే ఎన్నికల్లో నిలబడటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే ఇప్పుడు మరోసారి ఎన్నికల బరిలో నిలబడటానికి సన్నద్ధమవుతున్నారు. మున్ముందు ఏం జరుగుతుందో.. ఎలాంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement