
రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విమర్శలు..
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు.
అమేథీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. అమేథీ నుంచి లోక్సభకు ఎన్నికైన ప్రతినిధి(రాహుల్ గాంధీ) ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమయ్యారని ఆరోపించారు. ఆదివారం అమేథీ నియోజకవర్గంలో పర్యటించిన ఆమె.. స్థానిక ప్రజాప్రతినిధి విఫలమైనా మీకు కేంద్రమంత్రిగా నేను సహకారం అందిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
గోమతి నది వరదలతో నష్టపోతున్న అమేథీ నియోజకవర్గంలోని పిప్రి గ్రామంలో కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న గట్టు నిర్మాణ ప్రాజెక్టును స్మృతి ఇరానీ ప్రారంభించారు. 2014 ఎన్నికల్లో గ్రామస్తులు లోక్సభ ఎన్నికలను బహిష్కరించారని.. వరద నివారణకు గట్టు నిర్మించే ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. అలాగే.. జగదీశ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరోగ్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.