ప్రధాని మోదీగారూ మీకు సిగ్గనిపించడం లేదా? | PM Modi Lies in Amethi, Tweets Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీగారూ మీకు సిగ్గనిపించడం లేదా?

Published Mon, Mar 4 2019 11:15 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

PM Modi Lies in Amethi, Tweets Rahul Gandhi - Sakshi

న్యూఢిల్లీ: అమేథి పర్యటనలో తనపై విమర్శలు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. అమేథిలోనూ మోదీ యథాలాపంగా అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ‘2010లో నేనే స్వయంగా అమేథిలో ఆయుధాల ఫ్యాక్టరికి శంకుస్థాపన చేశాను. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ చిన్న చిన్న ఆయుధాలు తయారవుతున్నాయి. నిన్న మీరు అమేథి వెళ్లి మీకు అలవాటైన రీతిలో యథాలాపంగా అబద్ధాలు చెప్పారు. మీకు కొంచెం కూడా సిగ్గనిపించదా? (క్యా ఆప్‌కో బిల్‌కుల్‌ షరమ్‌ నహీ ఆథి)’ అంటూ రాహుల్‌ ట్విటర్‌లో ప్రశ్నించారు. 

2004 నుంచి అమేథి నియోజకవర్గానికి రాహుల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు రాహుల్‌ తల్లి సోనియాగాంధీ ఈ నియోజకవర్గంలో ఒక పర్యాయం పోటీ చేసి గెలుపొందారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోట అయిన అమేథిలో ప్రధాని మోదీ ఆదివారం సుడిగాలి పర్యటన చేసి.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. భారత్‌-రష్యా జాయింట్‌ వెంచర్‌ అయిన ఏకే 203 కలాషినికోవ్‌ అసాల్ట్‌ రైఫిల్‌ తయారీ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘2007లో ఆయుధాల తయారీ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి.. 2010లో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉండగా.. అలాంటిదేమీ జరగలేదు. స్థానిక ఎంపీ ఈ ఫ్యాక్టరీ ద్వారా 1500 మందికి ఉద్యోగాలు వస్తాయని ఊదరగొట్టారు. కానీ కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. అమేథిలో ఉద్యోగాలు కల్పించలేని వారు.. దేశంలో ఉద్యోగాల కల్పన గురించి లెక్చర్లు దంచుతున్నారు’ అని విమర్శించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement