
అమేథి: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీచేస్తున్న అమేథిలో హోరాహోరీ పోటీ నడుస్తోంది. గాంధీ-నెహ్రూ కుటుంబం కంచుకోట అయిన అమేథిలో కౌంటింగ్ ప్రారంభం నుంచి రాహుల్ గాంధీ, బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. రౌండ్.. రౌండ్‌కు ఆధిక్యాలు మారుతున్నాయి. మొదటి రౌండ్‌లో స్మృతి ఇరానీ ఆధిక్యం కనబర్చగా.. ఆ తర్వాత రాహుల్‌గాంధీ స్వల్ప ఆధిక్యాన్ని కనబర్చారు.
ఇప్పుడు మళ్లీ స్మృతి ఇరానీ ఆధిక్యంలోకి వచ్చారు. 4300 ఓట్లతో ఆమె రాహుల్ గాంధీపై ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇక్కడ రౌండ్.. రౌండ్‌కు ఆధిక్యాలు మారుతుండటంతో ఎవరు గెలుస్తారనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. 2014 ఎన్నికల్లో అమేథిలో రాహుల్‌కు గట్టి పోటీ ఇచ్చిన కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఈసారి కూడా ఆయనకు చుక్కలు చూపించే పరిస్థితి కనిపిస్తోంది. ఆరంభ ఆధిక్యాలను చూసుకుంటే స్మృతీ రాహుల్‌పై స్వల్ప లీడింగ్‌లో ఉండటం కాంగ్రెస్ శ్రేణులను కలవర పరుస్తోంది. ఇక్కడ రౌండ్‌రౌండ్‌కు ఆధిక్యాలు మారుతూ.. హోరాహోరీ పోటీ నెలకొని పరిస్థితి కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment