
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తొలిసారి రాహుల్ గాంధీ అమేథీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అమేథీకి రావడం అంటే సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్. ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషకరం. ప్రస్తుతం నేను వయనాడ్ నుంచి గెలిచి ఉండవచ్చు. కానీ మూడు దశబ్దాలుగా అమేథీతో నాకు అనుబంధం ఉంది. అమేథీ అభివృద్ధి కోసం ఢిల్లీలో పొరాడతాను’ అన్నారు.
తన పర్యటన సందర్భంగా రాహుల్ పార్టీ ప్రతినిధులను కలిశారు. సలోన్, అమేథీ, గౌరిగంజ్, జగదీశ్‌పూర్, తిలోయి అసెంబ్లీ నియోజకవర్గ బూత్ అధ్యక్షులను కలుసుకున్నారు. తన ఓటమి గురించి చర్చించారు. స్థానిక నాయకులు ప్రజలకు దూరంగా ఉండటం వల్లే తాను ఓడిపోయానన్నారు. అయితే నియోజకవర్గానికి, ఇక్కడ జరిగే కార్యక్రమాలకు తాను హాజరవుతానని రాహుల్ స్పష్టం చేశారు.
अमेठी आकर बहुत खुश हूँ। अमेठी आना घर आने जैसा लगता है। pic.twitter.com/B6YW2f7aLg
— Rahul Gandhi (@RahulGandhi) July 10, 2019